ఐకాన్ స్టార్ కు జోడీగా గ్లోబల్ క్వీన్ ?

తాజా సమాచారం ప్రకారం.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి చిత్రంలో ఆమెను నటింప జేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.;

By :  K R K
Update: 2025-04-04 00:58 GMT

లాస్ ఏంజిల్స్‌లో స్థిరపడిన ఇండియన్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. అమెరికన్ వెబ్ డ్రామాల ద్వారా గ్లోబల్‌గా గుర్తింపు పొందిన ఆమె, ఇప్పుడు భారతీయ చిత్రసీమలో మరోసారి హాట్ ఫేవరెట్‌గా మారింది. ఆమె తొలిసారి టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. అదీ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న అంతర్జాతీయ స్థాయి యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో. ఇటీవల హైదరాబాద్, ఒడిశాలోని కొరాపుట్‌లో రాజమౌళి - మహేష్ బాబు చిత్రానికి సంబంధించిన తన పార్ట్‌ను పూర్తి చేసింది ప్రియాంక.

ఇక తాజా సమాచారం ప్రకారం.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి చిత్రంలో ఆమెను నటింప జేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళ క్రేజీ డైరెక్టర్ అట్లీ, అల్లు అర్జున్‌తో కలిసి భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పలు హీరోయిన్లు, విదేశీ నాయికలు కూడా ఉంటారని తెలుస్తోంది. ఈ క్రమంలో అట్లీ.. ప్రియాంక చోప్రాను ఓ ముఖ్యమైన పాత్ర కోసం పరిశీలిస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ప్రియాంక ఈ సినిమాకు అంగీకరిస్తారా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సిన విషయం.

ఆమె ప్రస్తుతం రాజమౌళి - మహేష్ బాబు సినిమానే తన తొలి తెలుగు చిత్రం కావాలని భావిస్తోంది. అందుకే అట్లీ చిత్రం ముందుగా విడుదల అవుతుందని అనిపిస్తే, ఆమె అందులో నటించేందుకు ఆసక్తి చూపకపోవచ్చు. చివరకు, ఏం జరుగుతుందో వేచి చూడాలి. అయితే, ప్రియాంక చోప్రా మళ్లీ భారతీయ సినిమా దర్శకులకు క్రేజీ చాయిస్‌గా మారిన విషయం మాత్రం స్పష్టమే.

Tags:    

Similar News