ప్రభాస్ సమ్మర్ వెకేషన్ ఇక్కడే !

ప్రభాస్‌కి ఇటలీలో ఒక ప్రశాంతమైన గ్రామంలో విల్లా ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఆయనకు గోప్యతతో పాటు మంచి విశ్రాంతిని అందిస్తుందని అంటున్నారు.;

By :  K R K
Update: 2025-05-08 04:45 GMT

ఇటలీ అంటేనే ప్రభాస్‌కి ప్రత్యేకమైన ప్రేమ. ఇతర తెలుగు స్టార్లు మహేష్ బాబు యూరప్, యుఎస్‌ఏ వంటివి విభిన్న నగరాలు పర్యటిస్తూ ఆనందిస్తుంటే, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి వారు దుబాయ్ వంటి విలాసవంతమైన ప్రదేశాల్లో విరామం తీసుకుంటుంటారు. కానీ ప్రభాస్ మాత్రం ఇటలీని అత్యంత ప్రాధా న్యతతో ఎంచుకుంటాడు.

ప్రభాస్‌కి ఇటలీలో ఒక ప్రశాంతమైన గ్రామంలో విల్లా ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఆయనకు గోప్యతతో పాటు మంచి విశ్రాంతిని అందిస్తుందని అంటున్నారు. గత నెల నుంచి ఆయన సినిమాల షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి ఇటలీలోనే ఉంటున్నారని సమాచారం. ఈ వేసవి సెలవుల సీజన్ ముగిసే వరకు ఆయన అక్కడే ఉండే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టులు ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’. అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘స్పిరిట్’ షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. అయితే షూటింగ్ షెడ్యూల్‌లు ఎంత బిజీగా ఉన్నా సరే.. ప్రభాస్ మాత్రం తన ప్రశాంతతకు ఇటలీయే మంచి వెకేషన్ అని భావిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.

Tags:    

Similar News