‘స్పిరిట్’ ఎప్పుడు మొదలు పెడతానా అని ఆత్రుతగా ఉంది : త్రిప్తి దిమ్రి
‘‘‘స్పిరిట్’ సెట్స్‌పై షూటింగ్ స్టార్ట్ చేయడానికి నేను సూపర్ ఎక్సైటెడ్‌గా, ఆత్రుతగా వెయిట్ చేస్తున్నా.. ” అని చెప్పింది.;
బాలీవుడ్‌లో తన డైనమిక్ పెర్ఫార్మెన్స్‌తో సంచలనం సృష్టించిన త్రిప్తి దిమ్రి... సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ “యానిమల్” సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె తన బోల్డ్ అండ్ పవర్‌ఫుల్ నటనతో ప్రేక్షకుల మనసులు గెలిచింది. ఇప్పుడు.. ఈ టాలెంటెడ్ నటి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ తన కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని రాయడానికి రెడీ అవుతోంది. త్రిప్తి దిమ్రి తాజాగా తన మొదటి తెలుగు సినిమా ‘స్పిరిట్’ కు సైన్ చేసింది.
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ట్రిప్టీ తన ఎగ్జైట్‌మెంట్‌ను ఓపెన్‌గా షేర్ చేస్తూ, ‘‘‘స్పిరిట్’ సెట్స్‌పై షూటింగ్ స్టార్ట్ చేయడానికి నేను సూపర్ ఎక్సైటెడ్‌గా, ఆత్రుతగా వెయిట్ చేస్తున్నా.. ” అని చెప్పింది. నిర్మాతల సమాచారం ప్రకారం, “స్పిరిట్” సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కిక్‌స్టార్ట్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఓ కాప్ రోల్‌లో కనిపించనుండగా.. త్రిప్తి దిమ్రి అతని లవ్ ఇంట్రెస్ట్‌గా నటిస్తూ స్క్రీన్‌పై ఆకట్టుకోనుంది.
దర్శకుడు సందీప్ వంగా వరుసగా “అర్జున్ రెడ్డి”, “కబీర్ సింగ్”, “యానిమల్” లాంటి బ్లాక్‌బస్టర్‌లతో దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ సంపాదించాడు. అలాంటి డైరెక్టర్‌తో ప్రభాస్ లాంటి పాన్-ఇండియా స్టార్ కలిసినప్పుడు అంచనాలు స్కై-హై లెవెల్‌లో ఉండటం సహజం. ఈ కాంబోలో వస్తున్న “స్పిరిట్” సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. త్రిప్తి దిమ్రి కి ఇది బాలీవుడ్ వెలుపల చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఈ అవకాశం గురించి ఆమె మరింత ఎక్సైట్‌మెంట్‌లో ఉంది.