పవర్ ప్యాక్డ్ గా వచ్చేస్తున్న ‘దిల్ రూబా‘ ట్రైలర్!

Update: 2025-03-04 11:47 GMT

పవర్ ప్యాక్డ్ గా వచ్చేస్తున్న ‘దిల్ రూబా‘ ట్రైలర్!ఈనెలలో రాబోతున్న చిత్రాలలో కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా‘ ఒకటి. అసలు ఫిబ్రవరి 14న విడుదలవ్వాల్సిన ఈ చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘క‘ వంటి ఘన విజయం తర్వాత కిరణ్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ‘దిల్ రూబా‘పై అంచనాలు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టు ఈ చిత్రం ప్రచారాన్ని వేగవంతం చేసింది టీమ్.


విశ్వ కరుణ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించింది. సామ్ సి.ఎస్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్, మూడు పాటలు వచ్చాయి. లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్ మాత్రం ఫుల్ పవర్ ప్యాక్డ్ గా ఉండబోతుందని హింట్ ఇస్తూ.. ట్రైలర్ అనౌన్స్ మెంట్ కోసం ఓ ప్రమోషనల్ వీడియో చేసింది టీమ్. మార్చి 6న ‘దిల్ రూబా‘ ట్రైలర్ విడుదలవుతుంది.

Tags:    

Similar News