నిధి ఆశలన్నీ ‘రాజా సాబ్’ పైనే

“హరి హర వీర మల్లు” డిలే అవుతుందని, తనకు వచ్చిన ఒక బిగ్ ఆఫర్ తీసుకోవచ్చా అని అడిగింది. నిర్మాత ఓకే చెప్పాడు. కానీ ఒక్క సినిమాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.;

By :  K R K
Update: 2025-08-02 04:47 GMT

నిధి అగర్వాల్ నాలుగేళ్ల క్రితం “హరి హర వీర మల్లు” సినిమా కోసం సైన్ చేసినప్పుడు, ఆ ప్రాజెక్ట్‌కి పూర్తిగా డెడికేట్ అవ్వాలని ఒక బాండ్‌పై సంతకం చేసింది. అందుకే ఆ సినిమా షూటింగ్ ఆగిపోయే వరకూ వేరే ఏ ప్రాజెక్ట్‌నూ టచ్ చేయలేదు. కానీ, నిర్మాత ఫైనాన్షియల్ ఇబ్బందులు, పవన్ కల్యాణ్ పొలిటికల్ కమిట్‌మెంట్స్ వల్ల షూటింగ్ చాలా నెలలు స్తంభించి పోయింది. ఈ గ్యాప్‌లో డైరెక్టర్ క్రిష్ కూడా నిర్మాతతో గొడవపడి ప్రాజెక్ట్ నుంచి వాకౌట్ చేశాడు.

అప్పుడు నిధి, నిర్మాతని కలిసి, “హరి హర వీర మల్లు” డిలే అవుతుందని, తనకు వచ్చిన ఒక బిగ్ ఆఫర్ తీసుకోవచ్చా అని అడిగింది. నిర్మాత ఓకే చెప్పాడు. కానీ ఒక్క సినిమాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంకోటి తీసుకోవద్దని చెప్పాడు. అలా ఆమె ప్రభాస్ స్టారర్ “ది రాజా సాబ్” సినిమాను టేకప్ చేసింది.

ఈ ఏడాది స్టార్టింగ్‌లో, ఏడాదిన్నర గ్యాప్ తర్వాత “హరి హర వీర మల్లు” షూటింగ్ రీస్టార్ట్ అయింది. పవన్ కల్యాణ్ కూడా సెట్స్‌పైకి వచ్చాడు. నిధి అప్పుడు విజయవాడ-హైదరాబాద్ మధ్య షటిల్ అవుతూ, పవన్ సినిమాతో పాటు ప్రభాస్ సినిమా షూటింగ్‌ని కూడా జగిల్ చేసింది.

ఇప్పుడు “హరి హర వీర మల్లు” రిలీజ్ అయ్యింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో హిట్ అవలేదు. “ది రాజా సాబ్” షూటింగ్ కూడా దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఇక నిధి కొత్త సినిమాలు సైన్ చేయడానికి ఫ్రీ. కానీ, “హరి హర వీర మల్లు”పై పెట్టిన ఆశలు గల్లంతయ్యాయి. ఇప్పుడు ఆమె “ది రాజా సాబ్” సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాలని ఫుల్ హోప్స్‌తో ఉంది.

Tags:    

Similar News