‘ఓజీ‘ నుంచి ‘ఫైర్ స్టార్మ్‘ వచ్చేసింది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘ఓజీ‘. ‘ఆర్.ఆర్.ఆర్‘ వంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అందించిన డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతుంది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘ఓజీ‘. ‘ఆర్.ఆర్.ఆర్‘ వంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అందించిన డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతుంది. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఆడియన్స్ ముందుకు రానున్న ‘ఓజీ‘ ప్రమోషన్స్ మొదలు పెట్టింది టీమ్. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ స్టార్మ్‘ వచ్చేసింది.
తెలుగు, ఇంగ్లీష్, జపనీస్ భాషల లిరిక్స్ తో తమన్ వైవిధ్యంగా ఈ పాటను కంపోజ్ చేశాడు. ఈ పాటను కోలీవుడ్ స్టార్ శింబుతో పాటు తమన్, భరత్ రాజ్, నజీరుద్దీన్, దీపక్ బ్లూ, రాజ కుమారి ఆలపించారు. ఈ సాంగ్ లో పవర్ స్టార్ ఎలివేషన్స్ ఓ రేంజులో కనిపిస్తున్నాయి. మొత్తంగా.. ‘హరిహర వీరమల్లు‘తో అంతగా ఆకట్టుకోలేకపోయిన పవర్ స్టార్ ‘ఓజీ‘తో బడా బ్లాక్ బస్టర్ అందుకుంటాడనే అంచనాలు పెరుగుతున్నాయి.