‘పెద్ది‘ కోసం ఫోక్ సాంగ్

‘రంగస్థలం‘ చిత్రం తర్వాత మళ్లీ అదే తరహా పీరియాడిక్ జానర్ లో చరణ్ నటిస్తున్న చిత్రం ‘పెద్ది‘. ‘రంగస్థలం‘ చిత్రానికి అసోసియేట్ గా పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.;

By :  S D R
Update: 2025-08-02 11:51 GMT

‘రంగస్థలం‘ చిత్రం తర్వాత మళ్లీ అదే తరహా పీరియాడిక్ జానర్ లో చరణ్ నటిస్తున్న చిత్రం ‘పెద్ది‘. ‘రంగస్థలం‘ చిత్రానికి అసోసియేట్ గా పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఉత్తరాంధ్ర ప్రాంత నేపథ్యంతో ఆద్యంతం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

‘పెద్ది‘ సినిమా కోసం ఓ ఫోక్ సాంగ్ డిజైన్ చేశాడట డైరెక్టర్ బుచ్చిబాబు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ప్రాచీన జానపద గీతం ‘మా ఊరి ప్రెసిడెంటు‘ను రీమిక్స్ చేస్తూ ఒక ప్రత్యేక పాటను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పాటను జానపద గాయకుడు పెంచల్ దాస్ ఆలపించనున్నారని సమాచారం. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను వినాయకచవితి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా, ఇతర కీలక పాత్రల్లో శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు కనిపించనున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ ఆటకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లోనే నబా కాంత్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ ఫైట్ ను షూట్ చేస్తున్నారట. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. వచ్చే ఏడాది రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా ‘పెద్ది‘ రిలీజ్ కానుంది.

Tags:    

Similar News