'కూలీ' ట్రైలర్.. ప్యూర్ విజువల్ ట్రీట్!

సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ అవైటింగ్ మూవీ 'కూలీ'. ఇది రజనీకాంత్ సినిమా మాత్రమే కాదు.. పలు ఇండస్ట్రీల నుంచి అగ్ర కథానాయకులు నటించిన క్రేజీ మల్టీస్టారర్.;

By :  S D R
Update: 2025-08-02 13:59 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ అవైటింగ్ మూవీ 'కూలీ'. ఇది రజనీకాంత్ సినిమా మాత్రమే కాదు.. పలు ఇండస్ట్రీల నుంచి అగ్ర కథానాయకులు నటించిన క్రేజీ మల్టీస్టారర్. యాక్షన్ థ్రిల్లర్స్ ను తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రూపొందిన సినిమా ఇది.

సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన 'కూలీ' ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది. రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్ వంటి స్టార్స్ తో 3 నిమిషాలకు పైగా నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ ఆద్యంతం విజువల్ ట్రీట్ అందిస్తుంది.

'ఒకడు పుట్టగానే వాడు ఎవడి చేతిలో చావాలని ఉంది తలమీద రాసి పెట్టి ఉంటది' అనే నాగార్జున డైలాగ్ తో మొదలైన ఈ ట్రైలర్ లో.. ప్రతీ క్యారెక్టర్ కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు లోకేష్. కింగ్ నాగార్జున ఈ సినిమాలో తొలిసారిగా ఓ పవర్‌ఫుల్ విలన్ రోల్ లో కనువిందు చేయబోతున్నాడు. సౌబిన్ షాహిర్ క్యారెక్టర్ డిజైనింగ్ చాలా బాగుంది.

ఇంకా స్పెషల్ కేమియోలో అమీర్ ఖాన్, ఉపేంద్రలు అదరగొట్టబోతున్నారు. సత్యరాజ్.. రజనీకాంత్ స్నేహితుడిగా, శ్రుతి తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ ట్రైలర్ లో మరో స్పెషల్ మెన్షన్ రాక్ స్టార్ అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. మొత్తంగా.. ఓ పెద్ద స్మగ్లింగ్ నెట్‌వర్క్ బ్యాక్‌డ్రాప్ తో లోకేష్ అల్లుకున్న 'కూలీ' ఎలాంటి విజయాన్ని సాధిస్తుందనేది మరో రెండు వారాల్లో తేలనుంది.


Full View


Tags:    

Similar News