రజనీకాంత్ ‘కూలీ’ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి ‘ఏ ’ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ విషయం ఎవరూ ఊహించలేదు, ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.;
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ ఈ ఏడాది తమిళంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. తెలుగులోనూ ఈ సినిమాకు భారీ హైప్ ఉంది. అమెరికాలో ప్రీ-సేల్స్ అద్భుతంగా జరుగుతున్నాయి, ఇప్పుడు కెనడా కూడా ఈ జోష్‌లో చేరింది. తెలుగు వెర్షన్ ఒక్కటే ఇప్పటివరకు 100కే డాలర్స్ పైగా వసూళ్లు సాధించింది.
అనిరుద్, లోకేష్, మరియు టీమ్ ఈ భారీ చిత్రాన్ని మీడియా ఇంటర్వ్యూల ద్వారా ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా, షాకింగ్ అప్‌డేట్ ఒకటి వచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి ‘ఏ ’ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ విషయం ఎవరూ ఊహించలేదు, ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
‘ఏ ’ సర్టిఫికేట్‌కు కారణం తీవ్రమైన హింస ఉండొచ్చా లేక వేరే ఏదైనా కారణమా అన్నది సెన్సార్ సర్టిఫికేట్ వివరాల కోసం వేచి చూడాలి. లోకేష్ కనగరాజ్ కెరీర్‌లో ఇది మొదటి ‘ఏ ’ సర్టిఫికేట్ సినిమా కావడం గమనార్హం. ఇప్పటికే ఆకాశమంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమాకు ఈ తాజా అప్‌డేట్ మరింత హైప్‌ను జోడిస్తోంది. ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది.