రెండో రోజు సాలిడ్ కలెక్షన్స్

విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ డ్రామా ‘కింగ్డమ్‘. జూలై 31న భారీ అంచనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.;

By :  S D R
Update: 2025-08-02 09:54 GMT

విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ డ్రామా ‘కింగ్డమ్‘. జూలై 31న భారీ అంచనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా అద్భుతమైన వసూళ్లను సాధించింది. ప్రీమియర్స్ తో కలుపుకుని ‘కింగ్డమ్‘ తొలి రోజున రూ. 39 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్టు అధికారికంగా ప్రకటించింది టీమ్.

ఇక రెండో రోజు కూడా కలెక్షన్ల పరంగా అదరగొట్టింది. వరల్డ్ వైడ్ గా రెండు రోజులకు రూ.53 కోట్లు వసూళ్లను రాబట్టింది. ఈరోజు శనివారం, రేపు ఆదివారం కావడంతో ఈ వీకెండ్ కూడా ‘కింగ్డమ్‘కి బాగా కలిసొచ్చే అంశం. మొత్తంగా.. లాంగ్ రన్ లో ‘కింగ్డమ్‘ వంద కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.



Tags:    

Similar News