బన్నీ కోసం కొత్త మ్యూజిక్ డైరెక్టర్ !
ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించింది తమిళ యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ అని సమాచారం. ఆ ప్రకటన వీడియోలో కూడా అతడి మ్యూజిక్ వినిపించింది.;
డైరెక్టర్ అట్లీ – అల్లు అర్జున్ కలయికలో రూపొందుతున్న తాజా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌పై ఆసక్తికరమైన అంశాలు బయటపడుతున్నాయి. ఈ చిత్రంలో నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో అట్లీ కొన్ని అసాధారణమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. బాలీవుడ్‌లో "జవాన్" సినిమాతో అనిరుధ్ రవిచందర్‌ను పరిచయం చేసిన అట్లీ, ఇప్పుడు మళ్లీ అతడితో పని చేస్తాడని అనుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రకటన వీడియోలో అనిరుధ్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. అంతేకాదు, సాధారణంగా తాను పని చేస్తున్న చిత్రాల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడు అనిరుధ్. కానీ ఈసారి ఆయన పూర్తి నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇది ఆయన ఈ ప్రాజెక్ట్‌లో లేననే అంచనాలకు బలం చేకూర్చింది.
ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించింది తమిళ యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ అని సమాచారం. ఆ ప్రకటన వీడియోలో కూడా అతడి మ్యూజిక్ వినిపించింది. గత ఏడాది రెండు తమిళ వైరల్ పాటలతో సాయి అభ్యంకర్ పేరు బయటకొచ్చింది. ఆ పాటలు చూసిన అట్లీ అతడి ప్రతిభపై ఆకర్షితుడయ్యాడట. అందుకే ఈ సినిమాలో ఆయన్నే సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకునే అవకాశముంది.
ఇప్పటివరకు అట్లీ ఐదు చిత్రాలను దర్శకత్వం వహించాడు. అల్లు అర్జున్‌తో చేస్తున్న సినిమా ఆరవది అవుతుంది. ఆసక్తికరంగా, అతడు ఇప్పటివరకు రెండు చిత్రాలకు జివి ప్రకాష్ కుమార్‌తో, మరికొన్ని చిత్రాలకు ఏఆర్ రెహ్మాన్‌తో పని చేశాడు. ఇప్పుడు అనిరుధ్‌తో వరుసగా రెండో సినిమా చేసే బదులు కొత్త సంగీత దర్శకుడిని తీసుకుంటుండటం అట్లీ తీసుకున్న కొత్త ప్రయోగంగా చెప్పొచ్చు. ఈ సినిమా మీద అభిమానుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో అల్లు అర్జున్ కనిపించబోతుండటంతో ప్రేక్షకులు దీనిపై మరింత ఉత్సాహంగా ఉన్నారు. ఇక సంగీతం ఎలా ఉండబోతుందో చూడాలి.