డిజిటల్ రైట్స్ పోటీ మామూలుగా లేదు !

డిజిటల్ రైట్స్ విషయంలో అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్‌ఫ్లిక్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ రెండు ప్రముఖ సంస్థలు ఈ సినిమాను దక్కించుకోవడానికి భారీ మొత్తాలను ఆఫర్ చేశాయి.;

By :  K R K
Update: 2025-04-20 10:55 GMT

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న చిత్రం ‘అఖండ 2’. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా కావడంతో సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతోంది. తాజాగా ఇంటర్వెల్ సీన్స్ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి అంచనా వేసిన తుది బడ్జెట్ దాదాపు రూ. 200 కోట్లకు చేరుకోనుంది. సినిమాకు సంబంధించిన నాన్-థియేట్రికల్ డీల్స్‌ను ఫైనల్ చేయడంలో మేకర్స్ బిజీగా ఉన్నారు.

డిజిటల్ రైట్స్ విషయంలో అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్‌ఫ్లిక్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ రెండు ప్రముఖ సంస్థలు ఈ సినిమాను దక్కించుకోవడానికి భారీ మొత్తాలను ఆఫర్ చేశాయి. 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ డీల్‌ను ఎవరికి ఇవ్వాలనేది ఈ నెలాఖరులోగా నిర్ణయించనుంది. 2025లో విడుదలకాబోతున్న అన్ని పెద్ద సినిమాల డిజిటల్ రైట్స్ ఇప్పటికే అమ్ముడుపోయిన నేపథ్యంలో, ‘అఖండ 2’ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకోవడానికి ఓ రేంజ్‌లో పోటీ నడుస్తోంది.

ఈ చిత్రం దసరా కానుకగా విడుదల చేయాలని ఇప్పటికే ప్రకటించారు. మేకర్స్ సినిమా విడుదల తేదీని తప్పకుండా నిలబెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఆది పినిశెట్టి ప్రధాన ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. 

Tags:    

Similar News