‘మజిలీ’ దర్శకుడితో మళ్లీ చైతూ ?

లేటెస్ట్ బజ్ ఏంటంటే.. 'మజిలీ' సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ శివ నిర్వాణతో మళ్లీ టీమ్ అప్ అయ్యే ఛాన్స్ ఉందట.;

By :  K R K
Update: 2025-08-01 00:27 GMT

అక్కినేని వారసుడు నాగ చైతన్య.. రీసెంట్‌గా నటి శోభితా ధూళిపాళను పెళ్లి చేసుకుని.. మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ.. మరోవైపు తన కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈ 'తండేల్' స్టార్ ప్రస్తుతం 'విరూపాక్ష' ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండుతో ఓ మాసివ్ అడ్వెంచర్ థ్రిల్లర్ షూట్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ మాత్రమే థియేటర్స్‌లోకి వచ్చేలా ఉంది. మరోవైపు, చైతూ ఇప్పటికే తన నెక్స్ట్ ప్లాన్స్‌లో ఉన్నాడు.

లేటెస్ట్ బజ్ ఏంటంటే.. 'మజిలీ' సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ శివ నిర్వాణతో మళ్లీ టీమ్ అప్ అయ్యే ఛాన్స్ ఉందట. శివ నిర్వాణ.. చివరగా విజయ్ దేవరకొండ, సమంత జోడీగా 'ఖుషి' తీసిన తర్వాత, కొత్త ప్రాజెక్ట్ కోసం చూస్తున్నాడు. నానితో ఓ సినిమా సెట్ చేయాలని ట్రై చేసినా.. షెడ్యూల్ క్లాష్‌ల వల్ల అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు చైతూ, శివ నిర్వాణ ఇద్దరూ ఫ్రీగా ఉండటంతో.. 'మజిలీ' కాంబో మళ్లీ ఓ ఎమోషనల్ రైడ్‌తో రాకింగ్ చేయొచ్చని ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం ఇంకా రావాలి.

Tags:    

Similar News