ఈ వార్త నిజమేనా?

ఈ సినిమాలో నాయికగా మృణాల్ ఠాకూర్‌ను తీసుకునే అవకాశాలు బలంగా కనిపి స్తున్నాయట. ప్రధాన కథానాయికగా మృణాల్‌ను ఎంపిక చేసే దిశగా టీమ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.;

By :  K R K
Update: 2025-04-26 01:49 GMT

అల్లు అర్జున్ తదుపరి సినిమాను ప్రతిభావంతుడైన తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్‌లో అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి సినిమా నిర్మాణ విస్తృతిపై పెద్ద చర్చే నడుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కాస్టింగ్ ప్రక్రియను తుది దశలోకి తీసుకు వచ్చారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు వినిపిస్తున్న న్యూస్ ఏమిటంటే.. ఈ సినిమాలో నాయికగా మృణాల్ ఠాకూర్‌ను తీసుకునే అవకాశాలు బలంగా కనిపి స్తున్నాయట. ప్రధాన కథానాయికగా మృణాల్‌ను ఎంపిక చేసే దిశగా టీమ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

అయితే ఇక్కడే ఓ సమస్య ఉంది. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్‌లో ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో భారీ కమర్షియల్ సినిమాల అవకాశాలు అందుకోలేకపోయింది. భారతీయ సినీ రంగంలోనే అందమైన, ప్రతిభావంతమైన నటి అని పేరు సంపాదించు కున్నప్పటికీ, భారీ అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. ‘సీతారామం, హాయ్ నాన్నా’ లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ సాధించినా.. అవేమీ కమర్షియల్ గా పెద్ద సినిమాలు కాదు.

స్టార్ హీరోగా అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్‌ను బట్టి చూస్తే.. ఈ సినిమా విజయంలో ప్రధాన భారం అతని మీదే ఉండనుంది. మృణాల్ కెరీర్‌లో ఉన్న ఖాళీని ఈ సినిమా పూరించగలదా అనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా చిత్రబృందం ఆమెనే ఫైనల్ చేస్తుందా లేక ఇతర ఎంపికల వైపు దృష్టి పెడతారా అనే ప్రశ్న మిగిలిపోతోంది. త్వరలోనే ఈ కాస్టింగ్‌పై ఇంకా స్పష్టమైన సమాచారం రాబోతోంది. 

Tags:    

Similar News