సెకండ్ షెడ్యూల్ లోకి అడుగుపెట్టిన మెగా 157
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని అద్భుతమైన హిల్ స్టేషన్ ముస్సోరీలో, పచ్చని కొండలు, మంత్రముగ్ధం చేసే వాతావరణం మధ్య జరుగుతోంది. ఈ మూవీ ఒక రోలర్‌కోస్టర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది, ఇందులో హార్ట్‌టచింగ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఫుల్ లోడెడ్‌గా ఉంటాయని టాక్.;
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో జతకట్టిన లేటెస్ట్ సినిమా ఇప్పుడు ఫుల్ జోష్‌లో రెండో షెడ్యూల్‌లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని అద్భుతమైన హిల్ స్టేషన్ ముస్సోరీలో, పచ్చని కొండలు, మంత్రముగ్ధం చేసే వాతావరణం మధ్య జరుగుతోంది. ఈ మూవీ ఒక రోలర్‌కోస్టర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది, ఇందులో హార్ట్‌టచింగ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఫుల్ లోడెడ్‌గా ఉంటాయని టాక్.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ఫ్యాన్స్‌లో మాస్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇందులో లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఆమె అనిల్ రావిపూడితో ఫస్ట్ టైమ్ కొలేబరేషన్ కావడం స్పెషల్ హైలైట్. నయన్ గ్లామర్, యాక్టింగ్ ప్రోవెస్ ఈ సినిమాకి మరో లెవెల్ కిక్ ఇవ్వబోతున్నాయని అంటున్నారు. చిరంజీవి స్వాగ్, ఎనర్జీ, అనిల్ రావిపూడి మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్లేవర్ కలిస్తే సినిమా స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందో అని ఫ్యాన్స్ ఊహించుకుంటూ ఎగ్జైట్‌మెంట్‌లో మునిగిపోతున్నారు.
ఇప్పటికే హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన టీమ్, ఇప్పుడు ముస్సోరీలోని కూల్ కూల్ లొకేషన్స్‌లో సీన్స్‌ను క్యాన్ చేస్తోంది. ఈ సినిమా వర్క్ మొదలైన సందర్భంగా మేకర్స్ ఒక స్టైలిష్ వీడియోను రిలీజ్ చేసి, ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపారు. ఈ కాంబో నుంచి రాబోయే అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎప్పటికప్పుడు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.