సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మాళవిక
తన సూపర్ స్టైలిష్ లుక్స్, బోల్డ్ వైబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో చూపించే గ్లామరస్ అవతారంతో యూత్‌లో క్రేజ్ క్రియేట్ చేస్తున్న మాళవికా.. ప్రభాస్ “ది రాజా సాబ్” మూవీ టీజర్ రిలీజ్‌తో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.;
మాళవికా మోహనన్.. తమిళం, మలయాళం, హిందీ సినిమాలతో ఇప్పటికే స్టార్‌డమ్ సొంతం చేసుకున్న గ్లామర్ క్వీన్. ఇప్పుడు తెలుగు సినిమా జోన్‌లో ఫుల్ జోష్‌తో ఎంట్రీ ఇస్తోంది. తన సూపర్ స్టైలిష్ లుక్స్, బోల్డ్ వైబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో చూపించే గ్లామరస్ అవతారంతో యూత్‌లో క్రేజ్ క్రియేట్ చేస్తున్న మాళవికా.. ప్రభాస్ “ది రాజా సాబ్” మూవీ టీజర్ రిలీజ్‌తో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
టీజర్‌లో అదిరిపోయే ప్రెజెన్స్‌తో అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది మాళవిక. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లాంటి స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేస్తున్నా, మాళవిక తనదైన చార్మ్‌తో తళుక్కున మెరిసింది. టీజర్‌లో ఆమె రొమాంటిక్ సీన్స్, అందులోనూ లవ్ బైట్స్‌కి సంబంధించిన బోల్డ్ డైలాగ్ రిఫరెన్స్, ఆమె స్క్రీన్‌పై కనిపించే కిల్లర్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవన్నీ యంగ్ ఆడియన్స్‌ని ఫుల్ ఎంగేజ్ చేస్తున్నాయి. ఆమె స్టైల్, స్వాగ్ చూస్తే, “ఇది మాళవికా షో” అనిపించక మానదు.
“ది రాజా సాబ్”ని తన కెరీర్‌లో సూపర్ స్పెషల్ మూవీగా చెప్పుకుంటోంది మాళవిక. తన ఫేవరెట్ స్టార్ ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేయడం తనకి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అంటూ చెప్పుకొచ్చింది. “ప్రభాస్ సరసన నటించడం నా డ్రీమ్, ఇది నెరవేరిన మ్యాజికల్ మూమెంట్” అని సంతోషంగా షేర్ చేసింది. అంతేకాదు, డైరెక్టర్ మారుతి ఆమెకి ఇచ్చిన ఈ “కిక్కిచ్చే రోల్” గురించి కూడా సూపర్ ఎక్సైటెడ్‌గా ఉంది. “మారుతి గారు నాకు ఇంత అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చినందుకు ఫరెవర్ థాంక్స్,” అంటూ ఆమె కృతజ్ఞతలు తెలిపింది.