సినీ జగత్తులో చిరస్థాయిగా నిలిచిన కృష్ణవేణి -వెంకయ్య నాయుడు!

Update: 2025-03-03 02:40 GMT

తెలుగు చిత్రపరిశ్రమలో శ్రీమతి కృష్ణవేణి గారి స్థానం ప్రత్యేకమైనది. నటిగా, నిర్మాతగా, నేపథ్య గాయనిగా, శోభనచల స్టూడియో అధినేతగా ఆమె బహుముఖ ప్రతిభను ప్రదర్శించారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు హైదరాబాద్ ఫిలింనగర్‌లో జరిగిన కృష్ణవేణి గారి సంస్మరణ సభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

1949లో ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన మనదేశం చిత్రం ద్వారా నందమూరి తారకరామారావును పరిచయం చేసిన ఘనత కృష్ణవేణి గారిదేనని, అలాగే అక్కినేని నాగేశ్వరరావును స్టార్ స్టేటస్‌కు చేర్చడంలో ఆమె భర్త మీర్జాపురం రాజాతో కలిసి కీలక పాత్ర పోషించినట్లు వెంకయ్య నాయుడు గుర్తు చేశారు.

102 సంవత్సరాల సుదీర్ఘ జీవితాన్ని గడిపిన కృష్ణవేణి గారు, తెలుగు సినీ రంగానికి మార్గదర్శకంగా నిలిచారు. సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ద్వారా ఆమె జీవితం అందరికీ ప్రేరణగా నిలుస్తుందని వెంకయ్య నాయుడు ప్రశంసించారు.

ఎన్.టి.ఆర్. కమిటీ చైర్మన్ టి.డి. జనార్థన్, మురళీమోహన్, అక్కినేని రమేష్ ప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ, నిర్మాతలు కె.ఎస్. రామారావు, కైకాల నాగేశ్వరరావు తదితరులు కృష్ణవేణి గారి సినీ సేవలను స్మరించుకున్నారు. ఈ సంస్మరణ సభలో నందమూరి కుటుంబ సభ్యులు, అక్కినేని కుటుంబ సభ్యులు సహా పలువురు సినీ ప్రముఖులు హాజరై, కృష్ణవేణి గారి ప్రస్థానాన్ని గౌరవించారు

Tags:    

Similar News