హీరో ఎలివేషన్స్‌కు ‘KCPD’!
By : Surendra Nalamati
Update: 2025-03-11 09:54 GMT
కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం ‘దిల్‌రూబా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘క’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన కిరణ్, ఈ సినిమాతో మరింత బలంగా నిలవాలని చూస్తున్నాడు. లవ్, మాస్, యాక్షన్ అంశాలను సమపాళ్లలో కలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడట డైరెక్టర్ విశ్వ కరుణ్. ముఖ్యంగా 'క' సినిమాకి అదిరిపోయే మ్యూజిక్, బి.జి.ఎమ్. అందించిన సామ్ సి.ఎస్ సంగీతం 'దిల్‌రూబా'కి అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తుంది టీమ్.
ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్, పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి 'KCPD' అంటూ సాగే ఎనర్జిటిక్ సాంగ్ రిలీజయ్యింది. హీరో ఎలివేషన్స్ తో సాగే ఈ పాటను డైరెక్టర్ విశ్వ కరుణ్ రాయడం విశేషం. అభిషేక్ ఎ.ఆర్. ఎనర్జిటిక్ గా ఆలపించాడు. హోలీ స్పెషల్ గా మార్చి 14న 'దిల్‌రూబా' రిలీజ్ కు రెడీ అవుతుంది.