చిరు - అనిల్ కాంబో విలన్ ఇతడేనా?
విలన్ పాత్రలో కార్తికేయ గుమ్మకొండ కనిపించనున్నాడని వార్తలొస్తున్నాయి. ఆల్రెడీ అజిత్ ‘వలిమై’, నానీ ‘గ్యాంగ్ లీడర్’ మూవీస్ లో విలన్ గా నటించాడు కార్తికేయ.;
మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా లో ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అనిల్ రావిపూడి ఇప్పటికే ఈ చిత్ర బృంద సభ్యులను పరిచయం చేస్తూ.. ఓ వీడియో విడుదల చేసినప్పటికీ, చిరంజీవి తప్ప మరెవరి పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. అయినా.. కథానాయిక, విలన్ పాత్రల కోసం పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. అదితీ రావు హైదరీ ప్రధాన కథానాయికగా నటించ నున్నారని వార్తలొస్తున్నాయి. అదే సమయంలో నయనతార, ఐశ్వర్యా రాజేష్ లాంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు విలన్ పాత్రలో కార్తికేయ గుమ్మకొండ కనిపించనున్నాడని వార్తలొస్తున్నాయి. ఆల్రెడీ అజిత్ ‘వలిమై’, నానీ ‘గ్యాంగ్ లీడర్’ మూవీస్ లో విలన్ గా నటించాడు కార్తికేయ. వీటిలో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ఈ వార్తలు మాత్రం అభిమానుల్ని ఖుషీ చేస్తు్న్నాయి.
ఇవన్నీ ఊహాగానాలే తప్ప.. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ విషయాలపై ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రస్తుతం ఆయన స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరిచే పనిలో ఉండగా... షూటింగ్ లొకేషన్లను ఖరారు చేయడంపై దృష్టి పెట్టారు. ఇంకా టైటిల్ ఖరారు కాకపోయినా ఈ సూపర్ కాంబో సినిమా ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాహూ గారపాటి నిర్మించనుండగా.. చిరంజీవి కుమార్తె సుష్మిత సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.