‘శుభం’ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి !
శుభం చిత్రం సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. సెన్సార్ సభ్యులు సినిమా కంటెంట్ ను అమితంగా మెచ్చుకున్నారు.;
డైనమిక్ హీరోయిన్, ప్రొడ్యూసర్ సమంత తన "ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్" బ్యానర్‌పై నిర్మించిన తొలి చిత్రం “శుభం”. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ అందర్నీ ఆకట్టుకుంది. కామెడీ హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మే 9న థియేటర్లలో సందడి చేయనుంది. భయాన్ని, నవ్వును సమంగా మిళితం చేస్తూ, ప్రేక్షకులకు వినోదంతో కూడిన థ్రిల్లింగ్ అనుభూతిని ఇవ్వబోతోంది.
తాజాగా శుభం చిత్రం సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. సెన్సార్ సభ్యులు సినిమా కంటెంట్ ను అమితంగా మెచ్చుకున్నారు. కామెడీ, హారర్, ఎమోషన్ – అన్నిటినీ వినూత్నంగా, క్రేజీగా చూపిస్తూ యూనిక్ అనుభూతిని ఇచ్చే విధంగా సినిమా తయారైందని కితాబునిచ్చారు.
తాజాగా జరిగిన ప్రీమియర్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఆ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ నేడు, రేపు కూడా పెయిడ్ ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ సినిమా ప్రధాన ఆకర్షణగా హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ తదితర యువ నటీనటులు అద్భుతంగా నటించారు. వైవిధ్యమైన కథనంతో, అనుకోని మలుపులతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందిన ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందింది. చిన్నా-పెద్దా అందరూ కలిసి చూసేలా నవ్వులు, భయాలను సమపాళ్లలో అందించబోతుంది.