‘ఆర్య‘ మెమరీస్ పంచుకున్న అల్లు అర్జున్

‘ఆర్య‘ సినిమా.. అల్లు అర్జున్ ని హీరోగా నిలబెట్టిన చిత్రం. దర్శకుడిగా సుకుమార్ కి జీవితం ఇచ్చిన సినిమా.;

By :  S D R
Update: 2025-05-07 10:35 GMT

‘ఆర్య‘ సినిమా.. అల్లు అర్జున్ ని హీరోగా నిలబెట్టిన చిత్రం. దర్శకుడిగా సుకుమార్ కి జీవితం ఇచ్చిన సినిమా. నిర్మాతగా దిల్ రాజు ను మరో మెట్టు ఎక్కించిన మూవీ. అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీప్రసాద్ కాంబోకి శ్రీకారం చుట్టింది కూడా ‘ఆర్య‘ చిత్రమే. మే 7, 2004న విడుదలైంది ‘ఆర్య‘ చిత్రం. అంటే నేటికి ఈ సినిమా విడుదలై 21 ఏళ్లయ్యింది.

ఒన్ సైడ్ లవ్ లోని మజాను చూపించిన చిత్రం 'ఆర్య'. ఒకవిధంగా లవ్ స్టోరీస్ లోనే 'ఆర్య' ఓ ట్రెండ్ సెట్టర్. అప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో బన్నీ ని చూపిస్తూ.. సినిమా ఆద్యంతం తన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశాడు సుకుమార్. ఈ సినిమాలోని ఆర్య, గీతా పాత్రలను ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాడు.

'ఆర్య' సినిమాకి దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఈ సినిమాలోని ప్రతీ పాట హిట్టే. నేపథ్య సంగీతం మరో హైలైట్. 'ఆర్య'తో మొదలైన సుకుమార్, దేవిశ్రీప్రసాద్ ల బంధం.. ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తోనూ సుకుమార్ ఆ తర్వాత పలు సినిమాలు చేయడానికి దోహదం చేసిన చిత్రం 'ఆర్య'. తొలిరోజుల్లో దిల్‌రాజుకి నిర్మాతగా భరోసా ఇచ్చిన చిత్రం 'ఆర్య'.

'ఆర్య' సినిమా తెలుగులో మాత్రమే కాదు.. అనువాద రూపంలో మలయాళం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ ని మల్లు అర్జున్ గా ఓన్ చేసుకున్నారు మలయాళీ ఆడియన్స్. హిందీలోనూ 'ఆర్య' చిత్రం 'ఆర్య కీ ప్రేమ్ ప్రతిగ్య' పేరుతో డబ్ అయ్యింది. తమిళంలో 'కుట్టీ' పేరుతో ధనుష్ హీరోగా రీమేక్ అయ్యింది.

ఇంకా.. పలు భాషల్లో ఈ చిత్రం రీమేక్ రూపంలో అలరించింది. 'ఆర్య' సినిమాకి సీక్వెల్ గానే 'ఆర్య 2' తెరకెక్కించాడు సుకుమార్. ‘ఆర్య‘ విడుదలైన 21 ఏళ్లు అయిన సందర్భంగా కొన్ని ఆసక్తికర ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు అల్లు అర్జున్.



Tags:    

Similar News