కిరణ్ అబ్బవరం జీవితంలోకి కొత్త వెలుగు !
తన బిడ్డ చిన్న పాదాలను ముద్దుపెడుతున్న హృద్యమైన ఫోటోను షేర్ చేస్తూ, కిరణ్ ఈ క్యాప్షన్ జత చేశారు: "బ్లెస్డ్ విత్ బేబీ బాయ్.. హ్యాపీ హనుమాన్ జయంతి. థాంక్యూ’’.. అంటూ ఆ సంతోషకరమైన వార్తను తెలిపారు.;
టాలెంటెడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం, ఆయన భార్య రహస్య గోరక్ దంపతులకు పండంటి బాబు జన్మించాడు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ శుభవార్తను కిరణ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన బిడ్డ చిన్న పాదాలను ముద్దుపెడుతున్న హృద్యమైన ఫోటోను షేర్ చేస్తూ, కిరణ్ ఈ క్యాప్షన్ జత చేశారు: "బ్లెస్డ్ విత్ బేబీ బాయ్.. హ్యాపీ హనుమాన్ జయంతి. థాంక్యూ’’.. అంటూ ఆ సంతోషకరమైన వార్తను తెలిపారు.
కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ ప్రేమ కథ 2019 లో విడుదలైన వారి తొలి సినిమా "రాజా వారు రాణి గారు" చిత్రంతో ప్రారంభమైంది. ఆ చిత్రంలో ఇద్దరూ మంచి గుర్తింపు పొందగా, సినిమాను ఆడియెన్స్ హృదయ పూర్వకంగా స్వీకరించారు. ఆ సినిమా తర్వాత కిరణ్ వరుసగా సినిమాల్లో నటిస్తూ తన కెరీర్ను విజయపథంలో నడిపించగా, రహస్య మాత్రం సినీ రంగానికి విరామం ప్రకటించారు.
గత ఏడాది ఈ జంట పెళ్లి పీటలెక్కింది. పెళ్లి తర్వాత రహస్య గర్భధారణ సమయంలో తన బేబీ బంప్ ఫోటోలు, సీమంతం వేడుకలోని ఆనంద క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను అప్డేట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు పండంటి కుమారుడి రాకతో కిరణ్-రహస్య దంపతుల జీవితంలో కొత్త ఆనందాల సందడి మొదలైంది. అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.