ఘట్టమనేని వారసుడి గ్రాండ్ ఎంట్రీ!
ఘట్టమనేని వారి మూడో తరం వారసుడు వస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ నటనలో తన ప్రతిభను నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నాడు.;
ఘట్టమనేని వారి మూడో తరం వారసుడు వస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ నటనలో తన ప్రతిభను నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం అమెరికాలో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్న గౌతమ్ తాజాగా తోటి విద్యార్థితో కలిసి చేసిన స్కిట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో గౌతమ్ ఒక అమ్మాయితో క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నట్లు కనిపించి, తర్వాత ఆగ్రహావేశాలతో డైలాగ్ చెప్పిన విధానం నెటిజన్లను ఆకట్టుకుంది.
ఇప్పటికే గౌతమ్ లండన్‌లో తన తొలి స్టేజ్ ప్రదర్శన చేసి మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ విషయాన్ని నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ గౌతమ్ పెర్ఫార్మెన్స్ అద్భుతమని, చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీయడంలో ‘జాయ్ ఆఫ్ డ్రామా’ సమ్మర్ ప్రోగ్రామ్ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. మరోవైపు, మహేష్ కుమార్తె సితార వాణిజ్య ప్రకటనల ద్వారా తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
గౌతమ్ నటనలో మెళకువలు నేర్చుకుంటూ తన నటనా ప్రయాణాన్ని మొదలుపెట్టిన విషయం చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌కు మరో ప్రామిసింగ్ యాక్టర్ రాబోతున్నాడనే చర్చ సాగుతోంది. ఇప్పటికే సుకుమార్ తెరకెక్కించిన '1.. నేనొక్కడినే'లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన గౌతమ్.. త్వరలోనే హీరోగా గ్రాండ్ డెబ్యూ ఇవ్వబోతున్నాడనే సంకేతాలు అందుతున్నాయి.