కొత్త ప్రయోగానికి సిద్ధమైన గోపీచంద్!

Update: 2025-03-10 08:19 GMT

మ్యాచో స్టార్ గోపీచంద్ తన కెరీర్‌లో కొత్త మార్గాన్ని అన్వేషిస్తున్నాడు. ఇప్పటివరకు మాస్ కమర్షియల్ సినిమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన గోపీచంద్ ఈసారి కొత్త ధోరణిలో ప్రయోగం చేయనున్నాడు. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ కొత్త సినిమా ఫైనల్ అయింది.



సంపత్ నంది దర్శకత్వంలో సినిమా చేస్తాడని ప్రచారం జరిగినా, చివరకు గోపీచంద్ సంకల్ప్ రెడ్డిని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. వాస్తవ సంఘటనల ఆధారంగా టెక్నికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు తెరకెక్కించడంలో సంకల్ప్ దిట్ట.




 


‘ఘాజీ’తో జాతీయ అవార్డు గెలుచుకున్న సంకల్ప్ రెడ్డి ‘అంతరిక్షం, ఐబీ 71’తో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. గోపీచంద్-సంకల్ప్ రెడ్డి కాంబో మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ సెట్ చేసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఈ చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది.

Tags:    

Similar News