వెండితెర ప్రేమకావ్యం ‘సీతారామం‘
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా రూపొందిన ‘సీతారామం‘ అత్యద్భుతమైన విజయాన్ని సాధించింది. 1960ల నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రేమ, దేశభక్తి, త్యాగం వంటి భావోద్వేగాలతో మలిచాడు దర్శకుడు హను రాఘవపూడి.;
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా రూపొందిన ‘సీతారామం‘ అత్యద్భుతమైన విజయాన్ని సాధించింది. 1960ల నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రేమ, దేశభక్తి, త్యాగం వంటి భావోద్వేగాలతో మలిచాడు దర్శకుడు హను రాఘవపూడి. ప్రతిష్ఠాత్మక వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. 2022 ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం నేటితో మూడేళ్లు పూర్తిచేసుకుంది.
తెలుగులో వచ్చిన ప్రేమకథా చిత్రాలలో ‘సీతారామం‘ది ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం. కమర్షియల్ మూవీస్ కి పెట్టింది పేరైన వైజయంతి మూవీస్.. తమ మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటుగా ‘సీతారామం‘తో ఓ స్వచ్ఛమైన ప్రేమకథను ప్రేక్షకులకు అందించింది.
అంతకుముందే వైజయంతీ బ్యానర్ లో ‘మహానటి‘తో మంచి విజయాన్ని అందుకున్న దుల్కర్.. ఈ సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ కి ఇదే తొలి తెలుగు చిత్రం. ముఖ్యంగా ‘సీతారామం‘లో దుల్కర్, మృణాల్ ఇద్దరి జంట ఎంతో ఫ్రెష్ గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కీలక పాత్రల్లో రష్మిక, సుమంత్ అలరించారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ ఈ మూవీకి మరో మేజర్ ప్లస్ పాయింట్. ఈ సినిమాలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.