ఊర మాస్ గా ‘మాస్ జాతర‘ పాట

మాస్ మహారాజ రవితేజ ‘మాస్ జాతర‘ ప్రమోషన్స్ షురూ అయ్యాయి. భాను భోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 27న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.;

By :  S D R
Update: 2025-08-05 11:12 GMT

మాస్ మహారాజ రవితేజ ‘మాస్ జాతర‘ ప్రమోషన్స్ షురూ అయ్యాయి. భాను భోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 27న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో రవితేజాకి జోడీగా శ్రీలీల నటిస్తుంది. భీమ్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఓలే ఓలే‘ వచ్చేసింది.

ఈ పాటను భాస్కర్ యాదవ్ దాసరి రాశారు. భీమ్స్, రోహిణి సోరత్ ఆలపించిన ఈ సాంగ్ ఎంత మాసీగా ఉందో.. అంతకంటే మిన్నగా తమ డ్యాన్సులతో రెచ్చిపోయారు రవితేజ, శ్రీలీల. ‘ధమాకా‘ వంటి మ్యూజికల్ హిట్ తర్వాత రవితేజ, శ్రీలీల, భీమ్స్ కాంబోలో వస్తోన్న సినిమా ఇది. మొత్తంగా.. ఊర మాస్ గా ‘మాస్ జాతర‘ ఫస్ట్ సింగిల్ అదరగొడుతుంది.

Tags:    

Similar News