చిరంజీవి ఇంట్లో ముగిసిన నిర్మాతల సమావేశం

తెలుగు సినీ పరిశ్రమలో వేతనాల పెంపు వివాదం వేడెక్కుతున్న నేపథ్యంలో, ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఒక కీలక సమావేశం జరిగింది.;

By :  S D R
Update: 2025-08-05 13:48 GMT

తెలుగు సినీ పరిశ్రమలో వేతనాల పెంపు వివాదం వేడెక్కుతున్న నేపథ్యంలో, ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఒక కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రముఖ నిర్మాతలు సి. కళ్యాణ్, అల్లు అరవింద్, సురేష్ బాబు, మైత్రి మూవీ మేకర్స్ రవి శంకర్, అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుప్రియ యార్లగడ్డ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ –

"మేము చిరంజీవి గారిని కలిసి పరిశ్రమలో నెలకొన్న పరిస్థితిని వివరించాము. షూటింగ్స్‌ను సడెన్‌గా నిలిపివేయడం వల్ల కలిగే సమస్యలను తెలియజేశాము. ఈ విషయాలన్నీ చిరంజీవి గారు ఎంతో శ్రద్ధగా విన్నారు. ‘కార్మికుల పక్షాన కూడా విషయాలు తెలుసుకుంటాను. రెండు మూడు రోజులు పరిస్థితిని పరిశీలిస్తాను. అవసరమైతే తప్పకుండా నేను జోక్యం చేసుకుంటాను’ అని చిరంజీవి గారు స్పష్టంగా చెప్పారు" అని సి.కళ్యాణ్ తెలిపారు.

ఈ పరిణామంతో వేతనాల వివాద పరిష్కారానికి చిరంజీవి జోక్యం కీలకంగా మారనుంది. రెండు వర్గాలతో మాట్లాడి ఒక మధ్యస్థ పరిష్కారం సాధించేందుకు ఆయన ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News