మే నెల్లో భారీ చిత్రాల సందడి!

నాని ‘హిట్ 3’, సూర్య ‘రెట్రో’, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ లాంటి చిత్రాలు ప్రేక్షకులను ఉర్రూత లూగించేందుకు సిద్ధంగా ఉన్నాయి.;

By :  K R K
Update: 2025-03-16 04:21 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘హరిహర వీరమల్లు’ మార్చి నుండి మే కు వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో రవితేజ ‘మాస్ జాతర’ కోసం కొత్త విడుదల తేదీ అన్వేషిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రాన్ని ఆగస్టుకు మార్చారు.

దాంతో మే నెలలో వన్ బై వన్ పెద్ద సినిమాలు థియేటర్స్ లో సందడి చేయ నున్నాయి. నాని ‘హిట్ 3’, సూర్య ‘రెట్రో’, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ లాంటి చిత్రాలు ప్రేక్షకులను ఉర్రూత లూగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చిత్రం ఒక పీరియడ్ డ్రామాగా వస్తుండగా, నాని చిత్రం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రానుంది. సూర్య గ్యాంగ్‌స్టర్ కథతో వస్తుంటే, విజయ్ దేవరకొండ ఓ పీరియడ్ యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

పవన్ కళ్యాణ్ రెండు సంవత్సరాల విరామం తర్వాత థియేటర్లలోకి వస్తున్నందున, ఈ సినిమా విజయం ఆయనకు ఎంతో అవసరం. సూర్య గత చిత్రం ‘కంగువ’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. కాబట్టి ‘రెట్రో’ ద్వారా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. విజయ్ దేవరకొండ గతంలో వరుసగా ఫ్లాప్‌లు ఎదుర్కొన్నాడు, కాబట్టి ‘కింగ్‌డమ్’ అతని కెరీర్‌కు కీలకమైనది.

మరోవైపు, నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ‘హిట్ 3’ తో ఆ మ్యాజిక్ కొనసాగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వేసవి సినీ ప్రేమికులకు ఒక ఫుల్ ప్యాక్ ఎంటర్‌టైన్‌మెంట్ సీజన్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News