ప్రతీ నెలా ఒక పాన్ ఇండియా సినిమా

నవంబర్ తప్ప.. ప్రతి నెలా ఒక పాన్-ఇండియా చిత్రం విడుదల కానుంది. ఆ భారీ చిత్రాల జాబితా ఇదే ..;

By :  K R K
Update: 2025-07-18 01:09 GMT

2025 మొదటి ఆరు నెలలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా హిట్స్ లేకుండా నీరసంగా సాగాయి. కానీ.. రెండో సగం మాత్రం ఆశాజనకంగా కనిపిస్తోంది. నవంబర్ తప్ప.. ప్రతి నెలా ఒక పాన్-ఇండియా చిత్రం విడుదల కానుంది. ఆ భారీ చిత్రాల జాబితా ఇదే ..

1. జులై

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ ‘హరిహర వీరమల్లు’ జులై 24న విడుదల కానుంది. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా మొఘల్ యుగంలో సాగుతుంది. పవన్ కళ్యాణ్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్‌తో పోరాడే ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నారు.

2. ఆగస్టు

ఆగస్టులో రెండు పాన్-ఇండియా భారీ చిత్రాలు ‘కూలీ, వార్ 2’ ఆగస్టు 14న బాక్సాఫీస్ వద్ద ఢీకొనబోతున్నాయి. ‘వార్ 2’ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన యాక్షన్ డ్రామా కాగా.. ‘కూలీ’ రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శృతి హాసన్‌లతో కూడిన మల్టీస్టారర్ యాక్షన్ చిత్రం. ఈ క్లాష్ నిజంగా భారీ సమరం కానుంది.

3. సెప్టెంబర్

సెప్టెంబర్‌లో మల్టిపుల్ రిలీజ్ డేట్స్ లో పాన్-ఇండియా చిత్రాలు వస్తున్నాయి. తేజ సజ్జా నటించిన ఎంతగానో ఎదురుచూస్తున్న ‘మిరాయ్’ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. అలాగే, బాలకృష్ణ ‘అఖండ 2’, పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రాలు సెప్టెంబర్ 25న బాక్సాఫీస్ వద్ద ఢీకొనబోతున్నాయి. ఈ రెండు చిత్రాలూ పాన్-ఇండియా భాషల్లో రూపొందుతున్నాయి.

4. అక్టోబర్

అక్టోబర్‌లో రిషబ్ శెట్టి తన సూపర్ హిట్ చిత్రం ‘కాంతార’ ప్రీక్వెల్ కాంతార : చాప్టర్ 1 తో అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

5. డిసెంబర్

డిసెంబర్‌లో ఉత్తర భారతదేశంలో భారీ ఢీ ఉంది. ప్రభాస్ ‘ది రాజా సాబ్’, రణవీర్ సింగ్ ‘దురంధర్’, షాహిద్ కపూర్ టైటిల్ పెట్టని చిత్రం.. డిసెంబర్ 5న విడుదల కానున్నాయి. క్రిస్మస్ సమయంలో, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అవతార్ 3’ తో పాటు అడివి శేష్, మృణాళ్ ఠాకూర్ నటించిన ‘డెకాయిట్’ విడుదల కానుంది. ఈ భారీ చిత్రాలతో పాటు, మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’, విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’, నిఖిల్ సిద్ధార్థ ‘స్వయంభూ’, అనుష్క శెట్టి ‘ఘాటి’ చిత్రాలు కూడా ఈ ఏడాది విడుదల కానున్నాయి. కానీ వాటిలో కొన్ని విడుదల తేదీలు ఇంకా ఖరారు కాలేదు.

Tags:    

Similar News