'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్‌పై ఆసక్తికర అప్డేట్!

‘ఈ’ అనే అక్షరాన్ని హైలైట్ చేస్తూ – ‘ఈ సంవత్సరం కొన్ని బాకీలు తీర్చాలి’ అంటూ స్టేటస్ పెట్టారు. దీంతో ఫ్యాన్స్ ఊహాగానాలు మొదలయ్యాయి.;

By :  K R K
Update: 2025-03-20 04:23 GMT

యూత్‌కు బాగా కనెక్ట్ అయిన సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’. 2018లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఆశించిన స్థాయిలో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేదు. అయితే, కాలానుగుణంగా దీని క్రేజ్ పెరిగింది. సోషల్ మీడియాలో మీమ్స్ వల్ల ఈ సినిమా కొత్తగా వెలుగులోకి వచ్చింది. రీసెంట్‌గా రీ-రిలీజ్‌ సందర్భంగా భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది.

ఈ సినిమా సీక్వెల్‌ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఎక్కడికి వెళ్లినా, సినిమా ఈవెంట్స్‌కి హాజరైనప్పుడల్లా సీక్వెల్‌పై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తరుణ్ కూడా వీటికి ఫన్నీగా స్పందిస్తూ వచ్చారు. అయితే, తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఆసక్తికరంగా స్పందించారు.

‘ఈ’ అనే అక్షరాన్ని హైలైట్ చేస్తూ – ‘ఈ సంవత్సరం కొన్ని బాకీలు తీర్చాలి’ అంటూ స్టేటస్ పెట్టారు. దీంతో ఫ్యాన్స్ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇది ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ గురించేనని, ఈ ఏడాదే పనులు ప్రారంభం అవ్వనున్నాయని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే, దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఈ అప్డేట్‌తో సినీ ప్రేమికుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. తరుణ్ భాస్కర్ ఈ సారి ఏ విధంగా సీక్వెల్‌ తెరకెక్కిస్తారో చూడాలి.

Tags:    

Similar News