పైరసీపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు!
By : Surendra Nalamati
Update: 2025-03-05 09:02 GMT
సినిమాల పైరసీ గురించి నిర్మాత కీలక వ్యాఖ్యలు చేశారు. పైరసీ ఎవరి సినిమాను ప్రభావితం చేస్తే వారే ఆ సమస్య గురించి మాట్లాడుతున్నారని, కానీ కొద్ది రోజులకు ఆ చర్చ మర్చిపోతున్నారని అన్నారు. పైరసీకి అడ్డుకట్ట వేయాలంటే వ్యక్తిగతంగా కాకుండా, మొత్తం పరిశ్రమ కలిసి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
‘ఎఫ్ డి సి చైర్మన్‌గా తాను లీడ్ చేస్తాను. నిర్మాతలందరూ కలిసిరావాలి. పైరసీ వల్ల నష్టపోయేది నిర్మాతలే. పైరసీపై అందరూ మేల్కోవాలి‘ అని దిల్ రాజు అన్నారు. దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్‘ పైరసీ బారిన పడిన సంగతి తెలిసిందే. అలాగే గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన ‘తండేల్‘ సినిమా విడుదలైన రోజే హెచ్.డి. ప్రింట్ బయటకు వచ్చేసింది.