విలాసాల కోసం అప్పులు.. ఫలితం విలాపమే!

Update: 2025-02-25 04:33 GMT

'విలాసాల కోసం అప్పులు చేస్తే.. విలాపాలే' అనే కాన్సెప్ట్ తో రాబోతుంది 'తకిట తధిమి తందాన'. 'మర్డర్' ఫేమ్ ఘన ఆదిత్య, కొత్తమ్మాయి ప్రియ జంటగా నటించారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రాజ్ లోహిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎల్లో మ్యాంగో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చందన్ కొప్పుల ఈ సినిమాను నిర్మించారు.

తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా, భాజపా అగ్రనేత, కేంద్రమంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా టీజర్ విడుదలయింది. తాజాగా సినిమా యూనిట్ సభ్యుల సమక్షంలో ట్రైలర్ లాంఛ్ చేశారు. ట్రైలర్ చూస్తే వినోదంతో పాటు యువతకు రిఫ్రెషింగ్ థీమ్‌గా పని చేసేలా ఉందని తెలుస్తోంది.



Full View


'తకిట తధిమి తందాన' ద్వారా యువతను ఉద్దేశించి ఒక మంచి సందేశాన్ని వినోదాత్మకంగా చెప్పాం. జీవితంలో జల్సాల కోసం అప్పులు చేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఈ చిత్రంలో చూపించాం.' అని మేకర్స్ చెబుతున్నారు. ఈనెల 27న 'తకిట తధిమి తందాన' విడుదలకు ముస్తాబవుతోంది.

Tags:    

Similar News