రెండో వారంలోనూ జోరు తగ్గని ‘కోర్ట్‘!

Update: 2025-03-22 08:01 GMT

తెలుగు ఇండస్ట్రీకి ఈ ఏడాది ‘కోర్ట్‘ రూపంలో మరో బిగ్గెస్ట్ హిట్ దక్కింది. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సినిమా రెండో వారంలోకి ఎంటరైనా.. ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ తో దూసుకెళ్తుంది. దర్శకుడు రామ్ జగదీష్ తీసిన ఈ ఇంటెన్స్ కోర్ట్ డ్రామా ప్రేక్షకులను ఆలోచింపజేయడంతో పాటు మంచి వసూళ్లను కూడా రాబడుతుంది.




 తొలివారంలోనే బలమైన వసూళ్లు సాధించిన ఈ సినిమా, వీక్ డేస్ లోనూ మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఈ చిత్రం విడుదలైన 8 రోజుల్లో రూ.42.3 కోట్ల గ్రాస్ ను సాధించిందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు యూఎస్ బాక్సాఫీస్ వద్ద 9 లక్షల డాలర్లను దాటిన ఈ చిత్రం త్వరలోనే 1 మిలియన్ డాలర్ల మార్క్ ను చేరుకోనుంది. ఇదే స్థాయిలో వసూళ్లు కొనసాగితే, ఈ వీకెండ్ వరకూ ఈ మూవీ రూ.50 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకునే అవకాశముంది.




 


Tags:    

Similar News