నెక్స్ట్ మూవీ బాలీవుడ్లోనా లేక టాలీవుడ్లోనా?

తాజా సమాచారం ప్రకారం... చందూ ముండేటి బాలీవుడ్ హీరోలు కార్తీక్ ఆర్యన్, హృతిక్ రోషన్ లతో రెండు ప్రాజెక్టుల కోసం చర్చలు జరుపుతున్నారు.;

By :  K R K
Update: 2025-03-20 05:03 GMT

టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి ఇటీవల 'తందేల్' మూవీతో మంచి సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నాడు. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా రూ. 100 కోట్లు వసూలు చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సక్సెస్ తో చందూ మొండేటికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం... చందూ మొండేటి బాలీవుడ్ హీరోలు కార్తీక్ ఆర్యన్, హృతిక్ రోషన్ లతో రెండు ప్రాజెక్టుల కోసం చర్చలు జరుపుతున్నారు.

చందూ మొండేటి గీతా ఆర్ట్స్ సంస్థతో సినిమా చేయడానికి కమిట్ అయినట్లు సమాచారం. ఆసక్తికరంగా, ఇదే సంస్థ ప్రస్తుతం 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్‌ను కార్తీక్ ఆర్యన్‌తో తెరకెక్కించింది. అందువల్ల గీతా ఆర్ట్స్ ద్వారా కార్తీక్ ఆర్యన్, చందూ మొండేటి కాంబినేషన్ సినిమా త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఇక మరోవైపు, చందూ మొండేటి బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కు కూడా కథ వినిపించినట్లు సమాచారం. అయితే, హృతిక్ రోషన్ సినిమాలు అంగీ కరించడానికి ఎక్కువ సమయం తీసుకుంటారని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం ఉంది. అందువల్ల ఈ ప్రాజెక్ట్ త్వరగా ప్రారంభమయ్యే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

బాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు టాలీవుడ్ హీరో రామ్ పోతినేని తో కూడా చందూ మొండేటి ఓ కథను వినిపించినట్లు సమాచారం. ప్రస్తుతం రామ్ పి. మహేష్ బాబు దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత చందూ మొండేటి ప్రాజెక్ట్ గురించి స్పష్టత రానుంది.

ప్రస్తుతం చందూ మొండేటి బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు టాప్ హీరోలు, టాలీవుడ్ స్టార్ హీరోతో చర్చలు జరుపుతున్నారు. పరిస్థితిని బట్టి ఏ ప్రాజెక్ట్ ముందుగా సెట్స్ పైకి వెళ్తుందో ఆసక్తిగా మారింది. మొత్తానికి, 'తండేల్' విజయం తర్వాత చందూ మొండేటి కెరీర్ కొత్త మలుపు తిరిగింది. త్వరలోనే ఆయన ఏ సినిమాను మొదలుపెడతారో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News