‘చంద్రముఖి’ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జ్యోతిక ఇందులో చిరంజీవి చెల్లెలు పాత్రలో కనిపించనుందట. ఆమెది ఒక ఎమోషనల్ కేరక్టర్ అని టాక్. అదే నిజం అయితే ‘చంద్రముఖి’లో రజినీకాంత్ సరసన తెర మీద మెరిసిన నయనతార, జ్యోతిక కాంబినేషన్ మళ్లీ మళ్లీ గుర్తుకు రాక మానదు.;

By :  K R K
Update: 2025-04-30 00:40 GMT

టాలీవుడ్ లో నోస్టాల్జియా ఒక ఫీలింగ్ మాత్రమే కాదు, అది ఓ ఫార్ములా కూడా. ఆ ఫార్ములాని బాగా అర్థం చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు అతడు అదే బాటలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో అనిల్ చేస్తున్న తాజా సినిమా ఇప్పుడు మాస్ అంశాలతోనే కాకుండా, ఎమోషనల్ మిక్స్ తో కూడిన నటీనటుల ఎంపిక వల్ల కూడా చర్చలకు దారి తీస్తోంది. ఈ మూవీ కోసం అనిల్ రావిపూడి చంద్రముఖి సెంటిమెంట్ ను వర్కవుట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడని టాక్.

ప్రస్తుతం అనిల్ రావిపూడి విశాఖపట్నంలో ఉంటూ.. ఈ చిత్ర రెండవ భాగాన్ని పదునుపెడుతున్నట్టు సమాచారం. చిరంజీవి పాత్రలో ఆ భాగంలో ఓ భారీ మలుపు ఉంటుందట. ఆయన చిత్తూరు బాషలో మాట్లాడే పాత్రను పోషించనున్నారని, దానికి తగిన బాడీ లాంగ్వేజ్ కోసం అనిల్ ప్రత్యేకంగా రిహార్సల్స్ చేస్తున్నాడట. హిలేరియస్ కథనానికి తోడు.. ఈ సినిమాలో నటించనున్న నటీమణుల పేర్లు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

ఇండస్ట్రీ వర్గాల ప్రకారం నయనతార కథానాయికగా ఖరారయింది. ఈ పాత్ర కోసం ఆమె భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే అందరిలోనూ ఆసక్తి రేపుతున్నది జ్యోతిక పాత్ర. వినిపిస్తున్న వార్తల ప్రకారం.. జ్యోతిక ఇందులో చిరంజీవి చెల్లెలు పాత్రలో కనిపించనుందట. ఆమెది ఒక ఎమోషనల్ కేరక్టర్ అని టాక్. అదే నిజం అయితే ‘చంద్రముఖి’లో రజినీకాంత్ సరసన తెర మీద మెరిసిన నయనతార, జ్యోతిక కాంబినేషన్ మళ్లీ మళ్లీ గుర్తుకు రాక మానదు. మొత్తం మీద అనిల్ రావిపూడి కొత్త కథతో మళ్లీ పాత మాయాజాలాన్ని క్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. మరి ఈ సెంటిమెంట్ ఏ రేంజ్ లో వర్కవుట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News