యన్ సీ 24 కు హైలైట్ గా గుహ సెట్

ఈ సినిమాలోని ముఖ్యమైన ఆకర్షణల్లో ఒకటి అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మించిన భారీ గుహ సెట్. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగాల ఈ గుహను నిజమైన అనుభూతి కలిగేలా రూపొందించారు. మీడియా ప్రతినిధులకు ఈ సెట్ను ప్రత్యేకంగా చూపించారు. ఆ విభిన్నత, వాస్తవికత చూసి వారు అబ్బురపోయారు.;

By :  K R K
Update: 2025-05-17 01:19 GMT

అక్కినేని నవసామ్రాట్ నాగచైతన్య తన 24వ సినిమా కోసం అడ్వంచర్ కు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం మిస్టిక్ ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ పాత్ర కోసం నాగచైతన్య కొత్తగా హెయిర్‌స్టైల్ మార్చుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్‌పై షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలోని ముఖ్యమైన ఆకర్షణల్లో ఒకటి అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మించిన భారీ గుహ సెట్. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగాల ఈ గుహను నిజమైన అనుభూతి కలిగేలా రూపొందించారు. మీడియా ప్రతినిధులకు ఈ సెట్ను ప్రత్యేకంగా చూపించారు. ఆ విభిన్నత, వాస్తవికత చూసి వారు అబ్బురపోయారు.

ఈ గుహ సెట్‌ను రెండు నెలలపాటు శ్రమించి భారీ ఖర్చుతో రూపొందించారు. ఇందులో చిత్రంలోని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం సినిమా వేగంగా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు ‘విరూపాక్ష’ ఫేం కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మాణంలో బాపినీడు సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ‘దక్ష’ అనే పురావస్తు శాస్త్రజ్ఞురాలిగా నటిస్తున్నారు. ఆమె పాత్ర కథానాయకుని పాత్రతో ముడిపడిన కీలకమైనదిగా ఉంటుందని తెలిపారు. నాగచైతన్య ఈ సినిమా గురించి మాట్లాడుతూ, “కార్తీక్ దండు నారేషన్ విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. అంతకన్నా పెద్ద షాక్ ఈ భారీ గుహ సెట్ చూసినప్పుడు తగిలింది. ఇది నా కెరీర్‌లో ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో బడ్జెట్ పరంగా, స్థాయిలో అతిపెద్ద సినిమా. సినిమా థియేటర్‌లో పూర్తిస్థాయి అనుభూతి కలిగించేలా ఉండాలన్న నా కోరికకు యన్ సీ 24 తీరిపోయే జవాబు.”

మేకర్స్ చెబుతున్న ప్రకారం, ఈ సినిమా సాహసికతతో కూడిన కథనాన్ని అందించినా, ఇది ఇండియానా జోన్స్ తరహా ట్రెజర్ హంట్ కాదట. “ఇది కేవలం అడ్వెంచర్ సినిమా కాదు, చాలా విభిన్నంగా ఉంటుంది,” అని కార్తీక్ దండు చెప్పారు. మహత్తర స్థాయి, ప్రత్యేక కథనంతో యన్ సీ 24 సినిమా నాగచైతన్య కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా నిలిచే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News