మాస్ స్టెప్పులతో అదరగొట్టిన శ్రీలీల
ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘జూనియర్’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, జెనీలియా, వైవా హర్ష ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.;
ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘జూనియర్’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, జెనీలియా, వైవా హర్ష ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్, టీజర్ లకు మంచి రెస్పాన్స్ దక్కింది. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ‘వైరల్ వయ్యారి’ అనే మాస్ సాంగ్ రిలీజయ్యింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ లో హరిప్రియ, దీపక్ బ్లూ కలిసి ఈ పాటను ఆలపించారు. ఈ పాటలో దేవిశ్రీ మాస్ ట్యూన్ కి కళ్యాణ్ చక్రవర్తి అందించిన ట్రెండీ లిరిక్స్ బాగున్నాయి. ఇక ఆన్ స్క్రీన్ పై ఈ పాటలో హీరోహీరోయిన్లు కిరీటి, శ్రీలీల స్టెప్పులు అదరగొట్టేశారు.
కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, రవీందర్ ప్రొడక్షన్ డిజైన్, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీ టెక్నికల్ గా 'జూనియర్'కి ప్లస్ పాయింట్స్. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం జూలై 18న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది.