ఈడీ విచారణపై అల్లు అరవింద్ వివరణ

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనపై మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు. తాను 2017లో ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసిన సందర్భంలో జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడారు.;

By :  S D R
Update: 2025-07-04 15:40 GMT

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనపై మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు. తాను 2017లో ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసిన సందర్భంలో జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడారు.ఆ ప్రాపర్టీ కొనుగోలు సమయంలో ఒక మైనర్ వాటాదారుడు ఆ ఆస్తిలో భాగస్వామిగా ఉన్నారు. అయితే, ఆ తర్వాత ఆ వాటాదారుడికి సంబంధించి కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయని తెలిసింది. ప్రత్యేకంగా, ఆ వ్యక్తి బ్యాంకు లోన్ తీసుకుని దానిని తిరిగి చెల్లించలేకపోయారు, దాంతో ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరిగింది.

ఆ విచారణ సందర్భంగా, ప్రాపర్టీకి సంబంధించిన బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో తన పేరు కూడా ఉండటంతో, ఈడీ అధికారులు తనను సంప్రదించినట్టు అల్లు అరవింద్ తెలిపారు. బాధ్యతాయుతమైన పౌరుడిగా, తాను ఈడీ విచారణకు హాజరై, తన వైపు నుండి పూర్తి వివరణ ఇచ్చినట్టు అరవింద్ చెప్పారు. అయితే.. ఈ సంఘటనను మీడియా అతిగా ప్రచారం చేసిందని అల్లు అరవింద్ అన్నారు.

Tags:    

Similar News