‘వెంకట రమణ’గా వెంకటేష్?

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ షురూ అవుతోంది. అధికారిక ప్రకటన రానప్పటికీ, ఇప్పటికే స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి అయినట్లు సమాచారం.;

By :  S D R
Update: 2025-07-05 00:57 GMT

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ షురూ అవుతోంది. అధికారిక ప్రకటన రానప్పటికీ, ఇప్పటికే స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి అయినట్లు సమాచారం. ఈ చిత్రానికి ‘వెంకట రమణ’ అనే టైటిల్‌ను, ‘కేర్ ఆఫ్ ఆనంద నిలయం’ అనే ట్యాగ్‌లైన్‌ను ఫిక్స్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

ఇది ఫుల్ లెన్త్ కామెడీతో కూడిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందట. గతంలో త్రివిక్రమ్ రచయితగా వెంకటేష్ చిత్రాలకు పనిచేసినప్పటికీ, దర్శకుడిగా ఇదే మొదటిసారి. వెంకటేష్ టైమింగ్‌, త్రివిక్రమ్ డైలాగ్స్ కలవడంతో ప్రేక్షకుల అంచనాలు పెరుగుతున్నాయి.

ఈ ప్రాజెక్ట్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఆగస్టు చివరివారం నుంచి షూటింగ్ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 2026 సమ్మర్ టార్గెట్ గా ఈ మూవీ రెడీ కానుందట. మరోవైపు వెంకటేష్.. చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్ చిత్రంలోనూ ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. అలాగే ‘దృశ్యం 3’ రీమేక్ కూడా వెంకీ లైనప్ లో ఉంది.

Tags:    

Similar News