సందీప్ రెడ్డి నుంచి బయోపిక్ – ఎవరిపై?

Update: 2025-03-03 03:22 GMT

'అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్'.. ఈ మూడు చిత్రాలతోనే దేశవ్యాప్తంగా విశేష అభిమానులను సంపాదించుకున్న టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అయితే అంతే స్థాయిలో ఈ సినిమాలతో విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. సందీప్ తన సినిమాలలో పురుషాధిక్యతను ప్రోత్సహిస్తున్నాడని, స్త్రీలను కించపరిచేలా చూపిస్తున్నాడని విమర్శలు వస్తూనే ఉన్నాయి.

అయితే, ఈ విమర్శలకు గట్టి సమాధానం ఇస్తూ భవిష్యత్తులో కేవలం మహిళా పాత్రలతో కూడిన సినిమా తీయనున్నానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహిళా ప్రధాన కథాంశంతో రూపొందే ఆ చిత్రం నాలుగైదు సంవత్సరాల తర్వాత రాబొచ్చని వెల్లడించాడు. అయినప్పటికీ తనపై వచ్చే విమర్శలు తగ్గవని అంటున్నాడు.

ఇక మరో ఆసక్తికర విషయమేమిటంటే, 'మహానటి' తరహా బయోపిక్ తీసేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. కథ సిద్ధమవుతున్నా ఆ చిత్రం పట్టాలెక్కడానికి ఇంకా కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నట్టు వెల్లడించాడు. మరి సందీప్ తన శైలికి భిన్నంగా చేయాలనుకుంటున్న ఈ కొత్త ప్రయోగాలు ఎప్పుడు పట్టాలెక్కుతాయో? ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాయో చూడాలి!

Tags:    

Similar News