మెగాస్టార్ సినిమాల లైనప్‌పై కన్ఫ్యూజన్!
అనిల్ రావిపూడితో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు తాత్కాలికంగా ‘మెగా 157’ అనే టైటిల్ పెట్టారు. కానీ సంఖ్యా పరంగా చూస్తే, ‘విశ్వంభర’ చిరంజీవి 157వ సినిమా అవ్వాల్సి ఉంది.;
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన అనిల్ రావిపూడితో కొత్త సినిమాను ప్రారంభించారు. అలాగే, ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీతో కూడా చిరంజీవికి ఒక సినిమా కమిట్మెంట్ ఉంది. ఇప్పుడు సినిమాల లైనప్ విషయానికొస్తే.. చిరంజీవి తదుపరి సినిమా ‘విశ్వంభర’. అయితే ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉండగా.. చిరంజీవి ఇప్పటికే అనిల్ రావిపూడి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లారు.
ఇక్కడే అసలైన గందరగోళం మొదలవుతోంది. అనిల్ రావిపూడితో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు తాత్కాలికంగా ‘మెగా 157’ అనే టైటిల్ పెట్టారు. కానీ సంఖ్యా పరంగా చూస్తే, ‘విశ్వంభర’ చిరంజీవి 157వ సినిమా అవ్వాల్సి ఉంది. కానీ తాజా లాంచ్ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి సినిమాను ‘మెగా 157’గా ప్రకటించడం వల్ల చిరంజీవి తదుపరి విడుదలయేంటన్నది మరింత డైలమాలో పడింది.
అంటే, ‘విశ్వంభర’ సినిమా ప్రస్తుతానికి నిలిపివేసి... అనిల్ రావిపూడి సినిమాను ముందుగా విడుదల చేసే యోచనలో ఉన్నారా? లేదా రెండు సినిమాలు ఒకేసారి నిర్మాణంలో ఉంటాయా? అన్నది స్పష్టత రావాల్సిన అంశం. అయితే.. తాజాగా చిరంజీవి ‘మెగా 157’ ప్రారంభోత్సవంలో ‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ట కూడా పాల్గొనడం, ఆ సినిమా సజావుగా కొనసాగుతోందనే సంకేతాన్ని ఇస్తోంది. కాబట్టి ‘విశ్వంభర’ సినిమాపై ఎలాంటి అనుమానాలు లేకుండానే అది అనుకున్న సమయానికి విడుదల అవుతుందని భావించవచ్చు.