శ్రీలీల కు ప్రత్యామ్నాయంగా భాగ్యశ్రీ
శ్రీలీల స్థానంలో ఎంటర్ అయ్యింది.. టాలీవుడ్ లో ప్రస్తుతం దూసుకుపోతున్న అందాల భాగ్యశ్రీ బోర్సే.;
సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ మార్పులు ఇప్పుడు కామన్ సీన్ అయిపోయాయి. యంగ్ సెన్సేషన్ శ్రీలీల మాత్రం ఈ ట్విస్ట్‌లను కాస్త ఎక్కువగానే ఫేస్ చేస్తోంది. రాకెట్ స్పీడ్‌తో స్టార్‌డమ్ అందుకున్న ఈ అమ్మడు.. ఒకవైపు బడా అవకాశాలను సొంతం చేసుకుంటూనే.. మరోవైపు కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్‌ను అనూహ్యంగా మిస్ చేసుకుంటోంది. ఈ రోలర్‌కోస్టర్ రైడ్‌లో ఆమె జర్నీ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ మూవీ.. దాదాపు రెండేళ్ల ప్రీ-ప్రొడక్షన్ వర్క్ తర్వాత ఫైనల్‌గా ఫ్లోర్‌పైకి వచ్చింది. అఖిల్ కమ్‌బ్యాక్ కోసం ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ అతడి కెరీర్‌లో కీలకమైనదిగా చూస్తున్నారు. ఈ మూవీలో శ్రీలీల ఫీమేల్ లీడ్‌గా ఫైనలైజ్ అయి, షూటింగ్ కూడా స్టార్ట్ చేసింది. అందరూ ఈ ఫ్రెష్ జోడీ కెమిస్ట్రీ కోసం ఎగ్జైట్ అవుతుండగా.. ఊహించని విధంగా.. కేవలం ఎనిమిది రోజుల షూట్ తర్వాత శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.
శ్రీలీల స్థానంలో ఎంటర్ అయ్యింది.. టాలీవుడ్ లో ప్రస్తుతం దూసుకుపోతున్న అందాల భాగ్యశ్రీ బోర్సే. మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు, కానీ ఇండస్ట్రీ గుసగుసల ప్రకారం శ్రీలీల బిజీ షెడ్యూల్. ముఖ్యంగా డేట్స్ క్లాష్‌లే ఈ డ్రాప్‌కు కారణం. ఆమె ప్రెజెంట్ బాలీవుడ్‌లో బిగ్ బ్యానర్ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉంది. అటు పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లాంటి మాస్ మసాలా మూవీలో కూడా నటిస్తూ సూపర్ బిజీగా ఉంది. ఈ డేట్స్ గ్యాప్ వల్ల ‘లెనిన్’ నుంచి ఆమె అవుట్ అయినట్లు టాక్ నడుస్తోంది.
శ్రీలీల.. ఇలా ఈ ఒక్క ‘లెనిన్’ మూవీతోనే ఆగలేదు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘కింగ్‌డమ్’లో కూడా శ్రీలీల ఫస్ట్ ఛాయిస్ నే. ఈ మూవీ లాంచ్ ఈవెంట్‌లో ఆమె పాల్గొని, స్టేజ్‌పై ఫుల్ ఎనర్జీతో అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది. విజయ్‌తో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉంటుందనే ఆసక్తి ఫ్యాన్స్‌లో ఊపందుకుంది. కానీ, షాకింగ్‌గా ఆ తర్వాత ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి కూడా డ్రాప్ అయ్యింది. ఆమె స్థానంలో, మళ్లీ భాగ్యశ్రీ బోర్సేనే ఎంటర్! ‘కింగ్‌డమ్’ చుట్టూ ఉన్న భారీ హైప్, గౌతమ్ తిన్ననూరి లాంటి డైరెక్టర్ ట్రాక్ రికార్డ్, విజయ్ దేవరకొండ స్టార్‌డమ్ చూస్తే, ఇది శ్రీలీలకు ఖచ్చితంగా గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్ అయ్యేది. ఈ మిస్ ఆమె ఫ్యాన్స్‌ను కాస్త డిసప్పాయింట్ చేసింది.