అనుష్క, సుహాస్ బాక్సాఫీస్ క్లాష్ తప్పదా?

సుహాస్ “ఓ భామ అయ్యో రామ” సినిమా జూలై 11, 2025న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. కానీ, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదే రోజున అందాల అనుష్క శెట్టి, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లోని “ఘాటి” సినిమా కూడా రిలీజవుతోంది. ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడక తప్పడంలేదు.;

By :  K R K
Update: 2025-06-18 01:12 GMT

కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత హీరోగా మంచి సినిమాలు చేసిన సుహాస్‌కు ఇప్పుడు కాస్త కష్టకాలమే. తన తొలి సినిమాలతో అదిరిపోయే హిట్స్ కొట్టి, ఆడియన్స్ హృదయాల్లో స్పెషల్ ప్లేస్ సంపాదించిన సుహాస్, గత కొన్ని చిత్రాలతో మాత్రం బాక్సాఫీస్ వద్ద నీరసంగా కనిపిస్తున్నాడు. ఈ డౌన్‌ఫాల్, అతని కొత్త ప్రాజెక్ట్‌లపై కూడా ప్రభావం చూపిస్తోంది.

ఈ బ్యాక్‌డ్రాప్‌లోనే సుహాస్ హీరోగా, మలయాళం బ్యూటీ మాళవిక మనోజ్ హీరోయిన్‌గా నటిస్తున్న “ఓ భామ అయ్యో రామ” సినిమా రిలీజ్ డేట్ ఫైనల్ చేసుకోవడానికి టైమ్ తీసుకుంది. ఫైనల్‌గా, ఈ మూవీ జూలై 11, 2025న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. కానీ, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదే రోజున అందాల అనుష్క శెట్టి, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లోని “ఘాటి” సినిమా కూడా రిలీజవుతోంది. ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడక తప్పడంలేదు.

“ఓ భామ అయ్యో రామ” సినిమాను రామ్ గొడ్డాల రచన, దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇదొక ఫ్రెష్ రొమాంటిక్ డ్రామా, ఇందులో జెండర్ డైనమిక్స్‌ను కొత్త కోణంలో ఆవిష్కరించబోతున్నారట. ఇప్పటికే రిలీజైన టీజర్ సూపర్ ఎంటర్‌టైనింగ్‌గా ఉండడంతో, సినిమాపై బజ్ క్రియేట్ అయింది. సుహాస్‌కు ఈ సినిమా ఒక కమ్‌బ్యాక్ హిట్ అవుతుందని, అతని డల్ ఫేజ్‌ను బ్రేక్ చేసి మళ్లీ స్టార్ ట్రాక్‌పైకి తీసుకొస్తుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశిస్తున్నాయి. మరి ఈ రెండు సినిమాల్లో ఆడియన్స్ దేనికి పట్టం కడతారో చూడాలి.

Tags:    

Similar News