'పరదా'కి గోల్డెన్ ఛాన్స్

టాలీవుడ్ లో వారం వారం కొత్త సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. గడిచిన కొన్ని వారాలుగా తెలుగు చిత్ర సీమలో ఒకటికి మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూ వస్తున్నాయి.;

By :  S D R
Update: 2025-08-21 04:14 GMT

టాలీవుడ్ లో వారం వారం కొత్త సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. గడిచిన కొన్ని వారాలుగా తెలుగు చిత్ర సీమలో ఒకటికి మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూ వస్తున్నాయి. కానీ.. ఈవారం కాంపిటేషన్ పెద్దగా లేదు. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన 'పరదా'కి గోల్డెన్ ఛాన్స్ లభించినట్టే.

‘సినిమా బండి, శుభం’ సినిమాలతో గుర్తింపు పొందిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఫీమేల్ సెంట్రిక్ గా తెరకెక్కిన ఈ మూవీలో అనుపమతో పాటు మరో మలయాళీ స్టార్ దర్శన రాజేంద్రన్ కూడా నటించాడు. సంగీత, రాగ్ మయూర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో 'పరదా'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రేపు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్ గా 'పరదా' రాబోతుండగా.. మెగా అభిమానుల కోసం 'స్టాలిన్' కూడా రీ రిలీజ్ రూపంలో సిద్ధమైంది. అంజనా ప్రొడక్షన్స్ పై నాగబాబు నిర్మాణంలో మురుగదాస్ తెరకెక్కించిన 'స్టాలిన్' వరల్డ్ వైడ్ గా భారీ స్క్రీన్లలో విడుదలకు ముస్తాబవుతుంది.

Tags:    

Similar News