రీఎంట్రీకి రెడీ అవుతున్న ‘ఆనందం’ బ్యూటీ

2014 తర్వాత వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యల వల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు పూర్తిగా కోలుకుని, తనకు ఇష్టమైన నటనలో మళ్లీ రాణించడానికి రెడీ అయింది.;

By :  K R K
Update: 2025-08-21 06:41 GMT

రేఖ.. ఈ పేరు వినగానే గుండెల్లో ఓ అందమైన ఆనందం మెదులుతుంది. శ్రీను వైట్లా దర్శకత్వంలో వచ్చిన ‘ఆనందం’ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ, తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టింది. ‘ఆనందం’ విజయం తర్వాత ‘దొంగోడు, ఒకటో నంబర్ కుర్రోడు, జానకి వెడ్స్ శ్రీరామ్’ వంటి హిట్ సినిమాల్లో నటించింది. నాగార్జున ‘మన్మథుడు’ లో కూడా ఆమె చేసిన కామియో రోల్ అందరినీ ఆకట్టుకుంది. కానీ.. ఆ తర్వాత కొంత కాలానికి రేఖ టాలీవుడ్ నుంచి దూరమైంది.

ఇప్పుడు, ఈ కన్నడ అమ్మాయి మళ్లీ తెలుగు తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాకింగ్ లేకుండా, గాడ్‌ఫాదర్ లేకుండా చిన్న వయసులోనే తన టాలెంట్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రేఖ.. ఆ సమయంలో కన్నడ సినిమాల నుంచి కూడా ఆఫర్లు అందుకుంది. కానీ, 2014 తర్వాత వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యల వల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు పూర్తిగా కోలుకుని, తనకు ఇష్టమైన నటనలో మళ్లీ రాణించడానికి రెడీ అయింది.

రేఖా ఇప్పుడు తనను సవాలు చేసే, ఉత్తేజపరిచే పాత్రల కోసం ఎదురుచూస్తోంది. అంతేకాదు, ఓటీటీ షోలలో కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేయడానికి ఓపెన్‌గా ఉంది. ఇటీవలే తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను లాంచ్ చేసిన రేఖ, అభిమానులతో యాక్టివ్‌గా కనెక్ట్ అవుతోంది. ‘ఆనందం’ రోజుల్లోని ఆ చార్మ్ ఇప్పటికీ ఆమెలో అలాగే ఉంది. అభిమానులు ఆమెను మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి రేఖకు ఏ రేంజ్ లో ఛాన్సెస్ వచ్చి పడతాయో చూడాలి. 

Tags:    

Similar News