వచ్చే వేసవిలో 'విశ్వంభర'
మెగా విజువల్ వండర్ 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి.;
మెగా విజువల్ వండర్ 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి. వచ్చే సంవత్సరం వేసవి బరిలో 'విశ్వంభర' విడుదల కానున్నట్టు స్పెషల్ వీడియో బైట్ ద్వారా వివరణ ఇచ్చారు.
'విశ్వంభర' ఆలస్యం కావడానికి ప్రధాన కారణం విజువల్ ఎఫెక్ట్స్ అని.. సినిమాలోని సెకండాఫ్ అంతా వి.ఎఫ్.ఎక్స్ ప్రధానంగా ఉండబోతున్నట్టు చిరు తెలిపారు. ఇక ఈ రోజు సాయంత్రం 6 గంటల 6 నిమిషాలకు 'విశ్వంభర' నుంచి స్పెషల్ గ్లింప్స్ రాబోతున్నట్టు కూడా కన్ఫమ్ చేశారు. చిరు బర్త్ డే స్పెషల్ గా ఈ గ్లింప్స్ రాబోతుంది.
చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తుండగా.. ఇతర కీలక పాత్రల్లో ఆషిక రంగనాథ్, ఇషా చావ్లా, సురభి, కునాల్ కపూర్ వంటి వారు కనిపించబోతున్నారు. యు.వి.క్రియేషన్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మరి.. ఇప్పటికే విడుదలైన టీజర్ తో అంతగా ఆకట్టుకోని 'విశ్వంభర' ఇప్పుడు గ్లింప్స్ తో ఎలాంటి హైప్ సెట్ చేస్తుందో చూడాలి.