క్లైమాక్స్ షూట్ కు రెడీ అవుతోన్న ‘అఖండ 2’
ఇటీవలే జార్జియాలో క్లైమాక్స్ షూటింగ్‌కు టీం సిద్ధమవుతోందని వార్తలొచ్చాయి. ఇప్పుడు అధికారికంగా మే 21 నుండి ఈ షెడ్యూల్ ప్రారంభం కానుందని నిర్ధారించబడింది.;
పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ "అఖండ 2: తాండవం". ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇటీవలే జార్జియాలో క్లైమాక్స్ షూటింగ్‌కు టీం సిద్ధమవుతోందని వార్తలొచ్చాయి. ఇప్పుడు అధికారికంగా మే 21 నుండి ఈ షెడ్యూల్ ప్రారంభం కానుందని నిర్ధారించబడింది. ఈ దశలో ఊపిరి పీల్చుకోనివ్వని యాక్షన్ సన్నివేశాలను చిత్రీక రించనున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు, ఆయన బాణీలు ఇప్పటికే సినిమాపై హైప్‌ను మరింత పెంచుతున్నాయి.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంటా, గోపిచంద్ అచంటా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "అఖండ 2: తాండవం" సినిమా సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది. మరిన్ని అప్డేట్స్ త్వరలోనే తెలియజేయనున్నారు.