టాలీవుడ్ డైరెక్టర్ తో అజిత్ కుమార్ ?

ఇటీవల ‘లక్కీ భాస్కర్’ సినిమాతో దుల్కర్ సల్మాన్‌ను 100 కోట్ల క్లబ్‌లోకి తీసుకువచ్చిన దర్శకుడు వెంకీ అట్లూరి.. ఓ ఆసక్తికరమైన కథను అజిత్ కు వినిపించారట.;

By :  K R K
Update: 2025-04-17 01:21 GMT

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ విజయోత్సాహంతో ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమా దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. తాజాగా ఆయన 65వ సినిమా చర్చల్లోకి వచ్చేసింది. అభిమానులు ఆయన మాస్ అవతారానికి ఫిదా అవుతున్న ఈ తరుణంలో... ఈ వార్త టాలీవుడ్ అండ్ కోలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది.

తెలుగు నిర్మాత సమర్పణలో వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ గ్లోబల్‌గా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, తమిళనాడులోనే రూ.100 కోట్ల మార్కును దాటి కొత్త రికార్డులు నెలకొల్పింది. మరోసారి అజిత్ ఫీవర్ ఊపందుకుంది. అయితే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది వెంకీ అట్లూరితో అజిత్ కలయిక.

ఇటీవల ‘లక్కీ భాస్కర్’ సినిమాతో దుల్కర్ సల్మాన్‌ను 100 కోట్ల క్లబ్‌లోకి తీసుకువచ్చిన దర్శకుడు వెంకీ అట్లూరి.. ఓ ఆసక్తికరమైన కథను అజిత్ కు వినిపించారట. కథ విన్న అజిత్ తక్షణమే ఆకర్షితుడై గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం సూర్యతో సినిమా తీయడం లో బిజీగా ఉన్న వెంకీ, అజిత్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందించేందుకు ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు-తమిళ మేళవింపుతో రూపొందనున్న ఈ సినిమా.. అజిత్ కెరీర్‌లోనే స్టైలిష్‌గా, విభిన్నంగా ఉండే అవకాశం ఉందంటూ విశ్లేషకులు చెబుతున్నారు. అధికారిక ప్రకటన రాకముందే ఈ కాంబినేషన్‌కు అభిమానుల్లో విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. అజిత్ 65వ సినిమా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కితే, ఇది సౌత్ సినిమా ఇండస్ట్రీలో మరో హై వోల్టేజ్ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉంది.

Tags:    

Similar News