నానీని కలిసిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్ !

డైరెక్టర్ అభిషన్ జీవింత్ రీసెంట్‌గా హైదరాబాద్‌కు వచ్చాడు. అతడు నేచురల్ స్టార్ నానితో మీటింగ్ పెట్టుకున్నాడు. నాని ఆఫీస్‌లో జరిగిన ఈ సమావేశం అభిషన్‌కు లైఫ్‌టైమ్ మెమరీ అయ్యింది.;

By :  K R K
Update: 2025-06-14 09:15 GMT

కోలీవుడ్ లో "టూరిస్ట్ ఫ్యామిలీ" ఓ సంచలనం. లో బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ, బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అయ్యాక, తెలుగు ఆడియన్స్ ఈ సినిమా కంటెంట్‌కు ఫిదా అయిపోయారు. కథ, ఎమోషన్స్, డైరెక్షన్.. అన్నీ కలిసి ఈ సినిమాను ఓ బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి.

ఈ సినిమా డైరెక్టర్ అభిషన్ జీవింత్ రీసెంట్‌గా హైదరాబాద్‌కు వచ్చాడు. అతడు నేచురల్ స్టార్ నానితో మీటింగ్ పెట్టుకున్నాడు. నాని ఆఫీస్‌లో జరిగిన ఈ సమావేశం అభిషన్‌కు లైఫ్‌టైమ్ మెమరీ అయ్యింది. నాని ఫ్యాన్‌బాయ్ అయిన అభిషన్, ఈ మీటింగ్‌తో సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నాడు. త్వరలో ఇద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్ చేయాలని చర్చించారు. అభిషన్, నానికి త్వరలోనే ఓ కిల్లర్ స్క్రిప్ట్ నేరేట్ చేస్తానని ప్రామిస్ చేశాడు.

ఈ మీటింగ్ గురించి అభిషన్ సోషల్ మీడియాలో ఓ హార్ట్‌ఫెల్ట్ పోస్ట్ పెట్టాడు. “ఈ రోజు! నాని సార్.. మిమ్మల్ని కలవడం నా లైఫ్‌లో బిగ్గెస్ట్ మొమెంట్. మీ సింప్లిసిటీ, గ్రౌండెడ్ నేచర్ నన్ను టచ్ చేశాయి. మా సినిమా గురించి మీరు అంత డీటెయిల్‌గా, ఇంత పాషన్‌తో మాట్లాడటం చూస్తే.. నాకు మరింత స్పెషల్‌గా అనిపించింది. థ్యాంక్స్ సార్...” అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్, అభిషన్-నాని కాంబో కోసం ఇప్పటి నుంచే ఎక్సైట్ అవుతున్నారు. నానితో ఈ మీటింగ్ తర్వాత ఏదో బిగ్ అనౌన్స్‌మెంట్ త్వరలో వచ్చే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు.

Tags:    

Similar News