సెప్టెంబర్ 12న మూడు చిత్రాల క్లాష్ !
సెప్టెంబర్ లో.. మూడు విభిన్న జానర్లకు చెందిన ఆసక్తికరమైన చిత్రాలు ఒకేరోజున ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.;
ఇండిపెండెన్స్ డే నాడు టాలీవుడ్ లో హోరాహోరీ పోటీ తర్వాత.. సినీ ప్రియులకు మరో ఆసక్తికరమైన త్రిముఖ పోటీ రానుంది. సెప్టెంబర్ లో.. మూడు విభిన్న జానర్లకు చెందిన ఆసక్తికరమైన చిత్రాలు ఒకేరోజున ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
మొదటగా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న ‘కిష్కిందపురి’ మూవీ సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ హారర్ డ్రామాను కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేశారు, ఆయన గతంలో ‘చావు కబురు చల్లగా’ తీశాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్ ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ చేసింది.
మరోవైపు, దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘కాంత’ కూడా సెప్టెంబర్ 12న రిలీజ్ కావొచ్చని ఇన్‌సైడర్ సమాచారం. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది. సినిమా ఇండస్ట్రీ చుట్టూ కథ నడుస్తుంది. ఈ చిత్రాన్ని సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేశారు. రానా దగ్గుబాటి నిర్మాణం వహిస్తున్నారు.
ఇక, తేజ సజ్జా నటిస్తున్న సూపర్ హీరో యాక్షన్ చిత్రం ‘మిరాయ్’ కూడా రేసులో ఉంది. ఈ టీమ్ పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సెప్టెంబర్ 12 లేదా 19 తేదీల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ పవర్ స్టార్ ‘ఓజీ’ రిలీజ్‌కు ముందు రెండు వారాల వ్యవధి కోసం సెప్టెంబర్ 12ని లాక్ చేసే అవకాశం ఎక్కువ. ప్రస్తుతం.. ఈ మూడు చిత్రాలు తక్కువ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నాయి. మరి ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలి.